Homeజాతీయ వార్తలుChandrababu Alliance : రేవంత్‌ రెడ్డికి గొంతుకోస్తున్న చంద్రబాబు.. బీజేపీతో ఎసరు!  

Chandrababu Alliance : రేవంత్‌ రెడ్డికి గొంతుకోస్తున్న చంద్రబాబు.. బీజేపీతో ఎసరు!  

Chandrababu Alliance  : ‘ఏ తీరుగ నను దయజూచెదవో ఐన సంశోత్తమ రామా….. క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా…? ఈ భర్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే! తెలియక చేసిన నా తప్పుల్ని మన్నించి నా మీద దయ చూపమని శ్రీరామచంద్రుని చరణారవిందాల ఎదుట రామదాసు ప్రార్ధిస్తాడు. సరిగ్గా ఇదే భావాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎదుట ప్రకటించాలని మన చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి మోదీ దర్శన భాగ్యం కోసం, రామదాసు సన్నివేశం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పుడొకసారి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో మోదీకి చంద్రబాబు ఎదురుపడ్డారు. పూజకు వీలు చిక్కలేదు కానీ, హారతి కళ్లకద్దుకునేంత ఘడియ సమయం మాత్రం దొరికింది. అప్పుడాయన ప్రధాని వెళ్లే మార్గం పక్కన తొంభై డిగ్రీల లంబకోణంలో నిలబడి ఉన్నారు. వరుసగా అందర్నీ పలకరించినట్లే సీనియర్‌ నాయకులైన బాబును కూడా ప్రధాని పలకరించారు. వెంటనే తన మనసులోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. ‘మీరు ఏకాంత సమయమిస్తే చాలా విషయాలు మనవి చేసుకుంటానని సిగ్గుపడకుండా అడిగేశారు. సరే చూద్దామంటూ ప్రధాని వెళ్లిపోయారు.

అప్పటి నుంచి ప్రధాని ఏకాంత సేవకు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని బాబు ఎదురు చూడని క్షణం లేదు. ఈమధ్య బాహాటంగానే ప్రధాని గుణగణాలను ప్రస్తుతించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మామూలుగా పొగడలేదు. శ్రీ రఘువీర గద్యానికి ఇంచుమించు నదిపాటిగా భజించారు. అదేమిటి ఎన్నికలకు ముందు ప్రధానమంత్రిని అన్ని బూతులు తిట్టిన నోటితోనే ఎలా పొగుడుతున్నారనే అనుమానం ఎవరికైనా వస్తే వారు అమాయకుల కిందే లెక్క! చంద్రబాబులో ఉన్న చతుష్షష్టి కళల గురించి అవగాహన లేనివారికిందే లెక్క! రంగు మార్చుకొని ఊసరవెల్లి కావడం తొండకు మాత్రమే తెలుసా? ఆయనక్కూడా తెలుసు, గోడ మీద కూర్చొని ఎటు కుదిరితే ఆటు దూకడం పిల్లి మాత్రమే నేర్చిన విద్యార్థి ఆయన కూడా నేర్చారు. అందువల్ల ఆయన ఏం చేసినా ఆశ్చర్యపడకూడదు, నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం, బాబు రాజకీయంలో నీతి కోసం వెతకడం రెండూ. అవివేకమైన పనులే!
మోదీ, షాతో సమావేశం కోసం అదృశ్య శక్తి.. 
ఇన్నినాళ్లు వేదిక బాబు హృదయం శనివారం నాడు ఎగసి ఎగసి పడిందట. అదే ఊపులో ఢిల్లీకి ఆయన ఎగిరివెళ్లారు. ప్రధానమంత్రి మోదీతో, అమిత్‌ షాతో చంద్రబాబు సమావేశాలను ఏర్పాటు చేయడం కోసం ఆయన లాబీయిస్టులు రెండు మూడేళ్లగా చేయని ప్రయత్నం లేదు. అపాయింట్మెంట్‌ కొన్ని ’అదృశ్య శక్తుల ’ ఎంట్రీతో ఎట్టకేలకు ఖరారైందట! ఈ మేరకు శనివారం రాత్రి అమిత్‌ షాను చంద్రబాబు కలిశారు. మోదీ టైమ్‌ కోసం ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒడిశాలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ అపాయింట్‌ మెంట్‌ విషయం ఏమవుతుందో చివరిదాకా చెప్పలేము. కానీ, ఇన్నాళ్లు బాబుకు టైమివ్వని బీజేపీ నాయకత్వం ఇప్పుడెందుకు ఇచ్చినట్లు? చక్రం తిప్పిన అదృశ్యశక్తుులెవరు? ఇప్పుడు ఢిల్లీ తెలుగు సర్కిల్స్‌ ఇది చర్చనీయాంశం.
శరణు కోరుతూ.. 
అమిత్‌ షా భేటీలో పనిలో పనిగా తన ముందస్తు ‘వేడుకోలు’ ప్రార్ధన కూడా చంద్రబాబు చేసినట్లు భోగట్టా, ఫైబర్‌ నెట్, స్కిల్‌ కెవలప్మెంట్‌ కుంభకోణాల్లో ఇప్పటికే దొరికిపోవడం, రాజధాని భూ కుంభకోణంలో దొరికిపోయే పరిస్థితులు ఉం డటంతో ఆయన తీవ్ర ఆందోళన పడుతున్నారని తెలుస్తున్నది.
టీకాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా.. 
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ మీద దక్షిణాది ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో గెలిస్తేనే కర్ణాటక గాయం మానుతుందని భావిస్తున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా తెలంగాణ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి చేరికలు దాదాపుగా ఆగిపోయాయి. కాంగ్రెస్‌ లో కొంత కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ముందు బాబు ఒక ప్రతిపాదన ఉంచారు. తెలుగుదేశంతో అలయెన్స్‌ కుదిరితే హైదరాబాద్‌ సిటీ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి మెరుగ పుతుందని కొన్ని కార్ల్‌ లెక్కలు తయారు చేసినట్టు సమాచారం. ఆలయెన్స్‌ కారణంగా బీజేపీలో చేరికలు కూడా పెరిగి ఒక ఊపు వస్తుందనీ ఎల్లో మీడియా సంపూర్ణ సహకారం కూడా బీజేపీకి అభిస్తుందనీ చంద్రబాబు, అమిత్‌షాతో చెప్పినట్లు తెలిసింది. అంతేకాకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా గోడ దూకించేందుకు కూడా సహకరించగలనని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే తెలంగాణలో పుంజుకుంటున్న రేవంత్‌రెడ్డి గొంతును చంద్రబాబు తడిగుడ్డతో కోసినట్లే.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular