ఆంధ్రప్రదేశ్లో కులాల ఆధారంగా రాజకీయం కొనసాగుతుందనేది జగమెరిగిన సత్యం. ఇక్కడున్న కొన్ని వర్గాలు ఏ పార్టీపై మొగ్గుచూపితే ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. ఇలా మొగ్గుచూపే కులాల్లో కమ్మ, కాపు కులాలు కీలకమైనవి. ఈ కులాల వారిని ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు శత విధాలుగా ప్రయత్నిస్తుంటాయి. అయితే కమ్మ, కాపు కులాలు దగ్గరి సంబంధాలే కలిగి ఉన్నా.. ఈ రెండు కులాల వారు మాత్రం ఒక్కటి కాలేరు. ఎందుకంటే కాపు వాళ్లపై కమ్మ వర్గం ఎప్పుడూ డ్యామినేషన్ గానే ఉంటుంది. కానీ ఇటీవల ఈ రెండు కులాలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కమ్మ కులానికి చెందిన బాబు, కాపు కులానికి చెందిన పవన్ కలిస్తే రెండూ ఒక్క తాటిపైకి వస్తాయని భావిస్తున్నారు. కానీ అది జరిగేపనేనా..? ఎందుకంటే..?

చంద్రబాబు అనుకూల మీడియాలో గత కొన్ని రోజులుగా పవన్, బాబు కలుస్తారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఏన్నో ఏళ్లుగా రెండు కులాలు ఒక్క తాటిపైకి వస్తాయని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని అంటున్నారు. కానీ రెండు కులాల వారు ఎవరికి వారే అన్నట్లుగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా రెండు కులాల ఒక్కటిగా మారినా కాపులపై, కమ్మవర్గం పై చేయి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కాపు కులానికి చెందిన వారు ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. కమ్మ లేదా రెడ్డి కి చెందిన వారే కుర్చీలో కూర్చున్నారు.
ఇక రెండు కులాల్లోని వారు ఒకప్పటి లాగా లేదు. ముఖ్యంగా కాపులు స్థానిక పరిస్థితులను భట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి ఎవరు ప్రయోజనం చేకూరుస్తారో వారిని గెలిపిస్తున్నారు. ఉదాహరణకు భీమవరం నియోజకవర్గంలో కాపులు అధికంగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోయారు. ఇక్కడి వారు గ్రంథి శ్రీనివాస్ ను గెలిపించారు.
దశాబ్దాలుగా రెండు కులాలు వేరుగానే ఉంటున్నాయి. గుంటూరు లాంటి జిల్లాల్లో ఇప్పటికీ రెండుగానే ఉంటున్నారు. ఒక్కటి కాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కలిసి ఈ రెండు కులాలను ఒక్క తాటిపైకి తెస్తానంటున్నారు. మరి అది సాధ్యమైన పనేనా అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కమ్మ, కాపులు ఒక్కటైతే మిగిలిన కులాలవారంతా ఒక్కటవుతారు. దీంతో వారి బలం పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు బాబు, పవన్ నిర్ణయం బెడిసికొట్టే ప్రమాదం ఉంది.