Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: దీపావళికి పండుగ కానుకగా మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్న ... రాధే శ్యామ్...

Radhe Shyam: దీపావళికి పండుగ కానుకగా మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్న … రాధే శ్యామ్ టీమ్

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. బాహుబలి ఘన విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్రంపై కూడా కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సినిమా ఇండస్ట్రి అన్నింటిలో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అయితే త్వరలోనే రానున్న దీపావ‌ళి పండుగ సంధర్భంగా ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రాధే శ్యామ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

radhe shyam movie team going to surprise fans on diwali feastival

రాధే శ్యామ్ చిత్రం యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి అని తెలుస్తుంది. కాగా ఇందులో ప్ర‌భాస్ చేతి రేఖ‌ల‌ను చూసి జాత‌కం చెప్పేసే క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఒక‌వైపు బిజినెస్ మేన్‌, మ‌రో ప‌క్క భ‌విష్య‌త్‌ను గ్ర‌హించే వ్య‌క్తిగా… విక్రమాదిత్య క్యారెక్టర్ లో ప్రభాస్ ఏ రేంజ్ లో అలరిస్తారో అని ఆయన అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే పూజా హెగ్డే ఇందులో ” ప్రేర‌ణ‌ ” అనే పాత్ర పోషిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నాట్లో చిత్ర బృందం ప్రకటించారు.

దీపావళికి కనుక మరో టీజర్ ను రిలీజ్ చేస్తే ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దు ఉండదనే చెప్పాలి. త‌క్కువ గ్యాప్‌లో రెండు టీజ‌ర్స్ సినిమా నుంచి రావ‌డం అంటే నిజంగా ఫ్యాన్స్‌కు పండ‌గేన‌ని చెప్పొచ్చు. మ‌రో వైపు జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తుంది. ఇక ప్ర‌భాస్ మ‌రోవైపు స‌లార్‌, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు కంప్లీట్ అయ్యాక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ సినిమాల షూటింగ్‌ల‌ను కూడా స్టార్ట్ చేయనున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular