ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు మళ్లీ ఝలక్‌

శాసనంలో ఓ చట్టం చేయడం అంత ఈజీ అయిన పనికాదు. ప్రభుత్వ పెద్దలకో.. మరొకరికో వచ్చిన ఆలోచనలను పేపర్ మీద పెట్టేసి అసెంబ్లీలో ఆమోదించడం కాదు. దానికి ఎంతో లోతుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా అధికారులు పూర్తి చేయాలి. రాజ్యాంగ నిబంధనలు.. కేంద్ర చట్టాలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చట్టం చేయాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుంది. ఈ మాత్రం రూల్స్‌ కూడా అటు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసే ఉండాలి. Also Read: పేకాట ఆడితే […]

Written By: Srinivas, Updated On : March 8, 2021 12:48 pm
Follow us on


శాసనంలో ఓ చట్టం చేయడం అంత ఈజీ అయిన పనికాదు. ప్రభుత్వ పెద్దలకో.. మరొకరికో వచ్చిన ఆలోచనలను పేపర్ మీద పెట్టేసి అసెంబ్లీలో ఆమోదించడం కాదు. దానికి ఎంతో లోతుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా అధికారులు పూర్తి చేయాలి. రాజ్యాంగ నిబంధనలు.. కేంద్ర చట్టాలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చట్టం చేయాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుంది. ఈ మాత్రం రూల్స్‌ కూడా అటు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసే ఉండాలి.

Also Read: పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు

కానీ.. ఏపీలో అధికారులకు ఆ స్వేచ్ఛ లేకనో.. ఒకవేళ చట్టాలంటే పూర్తి అవగాహన లేకనో తెలియదు కానీ.. అసెంబ్లీలో పాస్ చేసి పంపించిన వాటిని బిల్లలను చెల్లవని కేంద్రం వెనక్కి పంపుతోంది. గతంలో దిశ లాంటి చట్టాలు వెనక్కి వచ్చాయి. ఇప్పుడు.. ల్యాండ్ టైటిల్ బిల్లు కూడా వెనక్కి వచ్చింది. ఈ బిల్లు ఒక్క సారి కాదు రెండు సార్లు వెనక్కి రావడం ప్రభుత్వం పెద్దల వైఫల్యాలను వెల్లడి చేస్తోంది.

ఏపీ సర్కారు 2019లోనే ల్యాండ్‌ టైటిల్‌ బిల్లును తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత కేంద్రం ఈ బిల్లును తిరస్కరించి గత నవంబరులో వెనక్కి పంపించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020 (భూమి హక్కు) పేరుతో ఏపీ సర్కార్ ఓ చట్టం చేసింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని.. సవరించాలని కేంద్రం వెనక్కి పంపింది. అయితే మళ్లీ ఆ సవరణలు చేయకుండా డొంక తిరుగుడుగా బిల్లు రూపొందించి పంపారు. దీంతో కేంద్రం నిర్మోహమాటంగా మళ్లీ బిల్లును వెనక్కి పంపించేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును మూడో సారి అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపాల్సి ఉంది. అప్పుడైనా ఆమోదిస్తారా లేదా అన్నది కూడా ఉత్కంఠే. ఎందుకంటే ఏపీలో బిల్లులు తయారు చేస్తున్న యంత్రానికి రాజ్యాంగంలో బేసిక్స్ కూడా తెలియని పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్ర నుంచి చట్టానికి అనుమతి రానేలదు.. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించారు.

Also Read: సొంత పార్టీకే ఎసరుపెట్టిన చింతమనేని

భూములకు పట్టాలిస్తామని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. అసలు చేసిన చట్టమే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేలింది. ల్యాండ్ టైటిల్ చట్టంలో కేంద్రం అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. కొన్ని అంశాలను తీసేడానికి ఏపీ సర్కార్ ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఆ చట్టానికి ఆమోదం లభిస్తే.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విషయంలో ఇష్టారీతిన పట్టాలు, ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వంటివిచేసి.. అక్రమాల పుట్ట చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ సర్కార్‌ పెద్దలకు రాజ్యాంగంపై పెద్దగా అవగాహన లేదని ఈ బిల్లును చూస్తే మరోసారి రుజువైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్