https://oktelugu.com/

Fake News: ప్రతి కుటుంబానికి రూ. 46715 సాయంపై కేంద్రం కీలక ప్రకటన

ఇటీవల సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తమ వలలో వేసుకునేందుకు కాచుకు కూర్చుంటున్నారు. ఫేక్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, లింక్స్‌లు పంపుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇక ప్రభుత్వాల పేరుతో పథకాలనూ ప్రచారం చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 27, 2024 / 08:50 AM IST

    Fake News

    Follow us on

    Fake News: ఒకప్పుడు దొంగలు ఇంటికి కన్నం వేస్తేగానీ ఏమీ దొరికేది కాదు. లేదంటే రద్దీ ప్రదేశాల్లో జేబులు కొట్టేసేవారు. కానీ, ఇప్పుడు దొంగలు మన వద్దకు రాకుండానే మన బ్యాంకులోని సొమ్మును కాజేస్తున్నారు. మన అమాయకత్వాన్ని, ఏమరుపాటును ఆసరాగా చేసుకుని సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. మన పర్సనల్‌ ఖాతా నుంచి సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనను ఈరోజుల్లో నిత్యం వేలల్లో జరుగుతున్నాయి. కోట్ల రూపాయల సొమ్మును సైబర్‌ కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. ఇక సైబర్‌ మోసాలను అరికట్టేందకు ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. సైబర్‌ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా నిరక్ష్యరాస్యులతోపాటు అక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు కూడా అప్పుడప్పుడు సైబర్‌ మోసగాళ్లకు చిక్కుతున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక కొందరు కేటుగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు. బ్యాంకు, ఇతర వివరాలు సేకరించి ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మాఫీ అయిన రైతుల సెల్‌ ఫోన్లకు మేస్సేజ్‌లు పంపించాయి బ్యాంకులు. ఇదే అదనుగా సైబర్‌ కేటాగాళ్లు బ్యాంకుల పేరుతో రైతులకు మెస్సేజ్‌లు పంపి బురిడీ కొట్టించారు. కొందరు డబ్బులు పొగొట్టుకున్నారు. తాజాగా మరో పథకంపై ప్రచారం చేస్తున్నారు.

    ప్రతీ కుటుంబానికి రూ.46,715 అని..
    ‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ అంటూ ఓ మెస్సేజ్‌ ఇపుపడు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చలామణి అవుతోంది. దేశంలో రోజుకో ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహన లేని వాళ్లు విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. తాజాగా దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్‌ సైతం అందులో ఉంది. దీంతో చాలా మంది దాని గురించి ఆరా తీస్తున్నారు. ఈమెస్సేజ్‌లో ఎంత వరకు నిజం ఉందని ఆరా తీస్తున్నారు. నేరుగా బ్యాంకులకు ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు.

    కేంద్రం కీలక ప్రకటన..
    కేంద్ర పథకం పేరుతో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం కూడా స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్‌ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం తేల్చింది. ఈ మేరకు ’ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్ ల్లో వ్యక్తి గత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.