https://oktelugu.com/

Zika Virus: దేశానికి మరో వైరస్‌ ముప్పు.. అలర్ట్‌ చేసిన కేంద్రం!

మహారాష్ట్రలో జికా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవి రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రులలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 4, 2024 / 03:59 PM IST

    Zika Virus

    Follow us on

    Zika Virus: దేశ ప్రజలను నాలుగేళ్లుగా ఏటా ఏదో వ్యాధి లేదా వైరస్‌ భయపెడుతోంది. మహమ్మారిగా మారుతోంది. తాజాగా మరో వైరస్‌ ముప్పు పొంచి ఉంది. ఇది ప్రజలను భయపెడుతోంది. జికా వైరస్‌ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అలర్ట్‌ చేసింది.

    మహారాష్ట్రలో కేసులు..
    మహారాష్ట్రలో జికా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవి రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రులలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున జనావాస ప్రాంతాలు, ఆఫీసులు, స్కూళ్లు, నిర్మాణ స్థలాల్లో వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

    ప్రకటనలు

    ‘జికా’ దండయాత్ర..
    వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికే సీజనల్‌ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఈ క్రమంలో జికా దండయాత్ర మొదలు పెట్టింది. కరోనా పీడను వదలిందనుకుంటున్న సమయంలో జికా వైరస్‌ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రతోపాటు అన్ని రాష్ట్రాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది.

    దోమల ద్వారా వ్యాప్తి..
    జిలా వైరస్‌ దోమల ద్వారా వ్యాపించే వైరస్‌. ఇది చాలా ప్రమాదకరమని కేంద్రం హెచ్చరిస్తోంది. నియంత్రణ కోసం జిల్లాకో నోడల్‌ అధికారిని నియమించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దోమలు రాకుండా, వైరస్‌ బారిన పడకుండా ఇళ్లు, నివాస ప్రాంతాలు, ఆఫీసలు, నిర్మాణ ప్రాదేశాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

    24 గంటల్లో 8 కేసులు..
    ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. పూణె, కొల్లాపూర్, సంగమేశ్వర్‌లో కూడా కేసులు నమోదవడంతో కేంద్రం ఢిల్లీ, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.