EC- Jagan: దేశంలో వైసీపీ నాయకులది విరుద్ధ వ్యవహార శైలి. అన్నింటిలోనూ తామే ముందుండాలని చూస్తారు. ఎడ్డమంటే తెడ్డమంటారు. నలుగురు నడిచిన దారిలో నడవలేమంటారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్ష పదవులు, నియామకాలుండవని తెలిసినా.. తమ పార్టీ అధినేత జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. తీరా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారికి షాకిచ్చింది. ఆ ఎన్నికల చెల్లదని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు కుడితిలో పడ్డ ఎలుక చందంగా విల్లవిల్లాడిపోతున్నారు. మా పార్టీ మా ఇష్టం అంటే కుదరదు కనుక సైలెంట్ అయ్యారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ తాజాగా స్పష్టం చేసింది. అలాంటి ఎన్నిక ప్రజాస్వామ్య విరుద్ధమని..ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టేనని వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ద్వరా హెచ్చరించింది.

వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత పదవులు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉన్నవారికి ఇది ఇట్టే ఎరుక. కానీ అన్ని పార్టీ మాదిరిగా వైసీపీ ఉండదు కదా. అందులో జగన్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న మొండి ఘటం. అందుకే ఏకంగా ప్లీనరీలో శాశ్వత అధ్యక్షుడిగా తను తానుగా నియమించుకున్నారు. పార్టీ నేతలతో పొగిడించుకున్నారు. నిజానికి ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉంటానని జగన్ భావిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులతో పదే పదే ఈ ప్రకటన చేస్తూ వచ్చారు.
అయితే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలంటే కనీసం ఆరుసార్లు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో నెగ్గాల్సి ఉంటుంది. అయితే పార్టీ విషయానికి వచ్చేసరికి ఇవేవీ ఉండవని భావించారో.. లేక తెలిసి ప్రవర్తించారో తెలియదు కానీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెయడంతో షాక్ కు గురవుతున్నారు.

అయితే శాశ్వత అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న వ్యాఖ్యలకు అప్పట్లో వైసీపీ నేతలు వక్రభాష్యం చెప్పారు. అటువంటప్పుడు తమిళనాడులో డీఎంకే కు కరుణానిధి ఎలా శాశ్వత అధ్యక్షుడయ్యారంటూ ప్రశ్నించారు. కానీ కరుణానిధి ఎప్పటికప్పుడు అధ్యక్ష స్థానానికి ఎన్నికవుతూ వచ్చారని తెలిసినా అప్పట్లో ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అయితే దీనికి మరో కారణం కూడా చెప్పారు. పార్టీని లాక్కునే వాళ్లు ఉన్నారని..అందుకే అలా చేశామని కూడా చెప్పారు. అయితే తాజా ఈసీ ఆదేశాలతో ఇలా పార్టీని లాక్కోవడానికి ప్రయత్నించే వాళ్లను బయటకు పంపుతారో ఏమో చూడాలి.
Also Read: Hurun Rich List 2022: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే
[…] Also Read: EC- Jagan: అది ఎన్నికల నియమావళికి విరుద్ధం..… […]
[…] Also Read: EC- Jagan: అది ఎన్నికల నియమావళికి విరుద్ధం..… […]