Sri Satya Love Affair: కంటెస్టెంట్ శ్రీసత్య హౌస్ లో డిప్రెస్డ్ గా ఉంటారు. పెద్దగా ఎవరితో మాట్లాడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కనీసం టాస్క్స్, గేమ్స్ పట్ల ఆసక్తి చూపకపోవడంతో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో అలా ఉంటే కుదరదన్నాడు. అప్పటికీ ఆమెలో మార్పు రాకపోవడంతో గత వారం భారీగా క్లాస్ ఇచ్చాడు. శనివారం ఎపిసోడ్లో నాగార్జున తొమ్మిది మంది కంటెస్టెంట్స్ కనీస పెర్ఫార్మన్స్ ఇవ్వలేదని పక్కన నిల్చోబెట్టాడు. నాగార్జున సపరేట్ చేసిన ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో శ్రీసత్య కూడా ఉన్నారు.

తిండి మీద ఉన్న ధ్యాస గేమ్ మీద లేదు. గేమ్ లో బొమ్మను వదిలేశావ్… అదే ఫుడ్ ప్లేట్ అయితే వదిలేదానివా అంటూ… ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. హౌస్ కి వచ్చింది తినడానికి పడుకోవడానికి అనుకున్నవాళ్ళు వెళ్లిపోవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నాగార్జున తిట్ల పురాణంతో శ్రీసత్యలో మార్పు వచ్చింది. ఆమె గత వారం నుండి గేమ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే శ్రీసత్య మానసిక వేదన వెనకున్న మేటర్ బయటికి వచ్చింది. ఈ విషయాన్ని శ్రీసత్య స్వయంగా తెలియజేశారు.
టీనేజ్ నుండే శ్రీసత్య పవన్ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించారు. ఏళ్ళ తరబడి వీళ్ళ రిలేషన్ సాగింది. పెళ్లి చేసుకొని ఒకటవ్వాలి అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా అనూహ్యంగా విడిపోయారు. శ్రీసత్య, పవన్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పవన్ రెడ్డి తనను మోసం చేశాడని శ్రీసత్య ఆరోపణ. లవ్ ఫెయిల్యూర్ తో నెలల తరబడి మానసిక వేదన అనుభవించినట్లు ఆమె తెలిపారు. హౌస్ లో ఆమె ప్రవర్తనకు కూడా లవ్ ఫెయిల్యూరే అని శ్రీసత్య తెలియజేశారు. అయితే పవన్ రెడ్డి వర్షన్ మరోలా ఉంది. శ్రీసత్య తనను మోసం చేసినట్లు చెబుతున్నాడు. తాను మోసం చేయాలనుకుంటే నిశ్చితార్థం వరకు వెళ్ళను కదా అంటున్నాడు.

మరి వీరిద్దరిలో ఎవరు తప్పు చేశారు? ఎవరిని ఎవరు మోసం చేస్తారు? అనేది వారికే తెలియాలి. ఇక హౌస్ లో శ్రీసత్యను ఇంప్రెస్ చేయడానికి అర్జున్ కళ్యాణ్ ట్రై చేస్తున్నట్లుంది. ఎక్కువ సమయం ఆమెతోనే ఉంటున్న అర్జున్ కళ్యాణ్ ఇష్టం కనబరుస్తున్నాడు. శ్రీసత్య ఏం చెప్పినా… ఎస్ అంటున్నాడని, అర్జున్ కి ఆమె అంటే ఇష్టమని నేహా చౌదరి, శ్రీహాన్ చెప్పుకున్నారు. ఇంతవరకు ఒక్క లవ్ స్టోరీ కూడా స్టార్ట్ కాలేదు శ్రీసత్య, అర్జున్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి. మూడు వారాలకు షో దగ్గరపడుతోంది. షాని, అభినయశ్రీ ఎలిమినేట్ కాగా హౌస్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.