
కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ ల మధ్య వివాదం ముదురుతోంతి. బుధవారం నుంచి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే దీనిపై సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ కోర్టు కెక్కింది. అయితే వాట్సాప్ యాజమాన్య సంస్థ యజమాని అయిన ఫేస్ బుక్ కొత్త నిబంధనలపై ఆలోచిస్తామని ప్రకటన చేసిన తరువాత కూడా వాట్సాప్ కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆరోపించింది. అయితే ప్రభుత్వం కూడా తగ్గకుండా కొత్త నిబంధనలతో సోషల్ మీడియా సంస్థలకు, ప్రజలకు నష్టమేమీ లేదంటూ వాదించింది.
దేశ భద్రత కోసం నేరస్తుల సమాచారాన్ని అడిగితే ప్రజల గోప్యతంటూ వాదిస్తున్న వాట్సాప్ తన వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకోవాలని చూస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇక్కడి నిబంధనలు పాటించాలని వాదించింది. అంతేకాకుండా కొత్త నిబంధనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలనని ప్రశ్నించింది. ఇందులో భాగంగా అన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
అయితే వాట్సాప్ మాత్రం ప్రజలకు సంబంధించిన సమాచారం అంతా తెలియజేయడమంటే వారి గోప్యతకు భంగం కలిగించడమేనని అంటోంది. నిబంధనల్లో 4(2) నియమం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వాదించింది. అయితే దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారాన్ని పెడితే ఆ విషయాలు చెప్పాలని ప్రభుత్వం అంటోంది. కానీ వాట్సాప్ అలా తెలియజేయలేమని చెబుతోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సమాచారాన్ని వాట్సాప్లో పెడితే ఏ మూల నుంచి వచ్చిందో తెలుసుకొని కేంద్రానికి తెలియజేయాలి. అంతే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్ తీసేయాలి. అయితే దీంతో వ్యక్తుల సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడమే. దీనికి ఒప్పుకోమని వాట్సాప్ యాజమాన్యం తరుపున న్యాయవాదులు వాదించారు. ప్రజల సమాచార గోప్యతను కాపాడడానికి వాట్సాప్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.