Jamili Elections: 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్నికల వేడిని తలపించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్లను రాబట్టుకోవడానికి ప్రభుత్వాలు తాము చేపట్టిన పనుల నుంచి ప్రజా వ్యతిరేకత వస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో తమది మంచి ప్రభుత్వమని.. ప్రజల కోసం అవసరమైతే వెనక్కి తగ్గుతామని చెప్పేందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఇటీవల ఊహించని పరిణమాలు ఎదురవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను.. ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాలపై వెనుకడుగు వేశాయి. ఒక సందర్భంలో ఈ విషయాల్లో ఎన్ని ఇబ్బందులైనా ముందుకెళ్దామనుకున్న వారు ఇప్పుడు సడెన్లీగా నిర్ణయం మార్చుకోవడంలో అంతర్యం ఏమిటన్న చర్చ తీవ్రంగా సాగుతోంది..? దీంతో అసలు దేశంలో ఏం జరుగుతుందోనని అనుకుంటున్నారు.
Also Read: జగన్ పీచేముడ్.. బలమొచ్చింది.. ‘‘మండలి రద్దు’’ రద్దైంది!
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి త్వరలో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణమని అంటున్నారు. అయితే ఆ విషయం పక్కనబెడితే ఢిల్లీ పెద్దలు మరో ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. కేంద్రం మదిలో చాలా కాలంగా ఉంటున్న జమిలీ ఎన్నికల ప్రస్తావన ఉంది. అయితే కొంతకాలంగా అది మరుగున పడింది. తాజాగా దీనినితెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా అందుకు అంగీకారం తెలపడంతో ఇక తరువాత కార్యక్రమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమిలీ ఎన్నికలపై చర్చించారు. ఈ విధానానికి టీడీపీ అమోదం తెలిపింది. కానీ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అయితే పార్టీల అభిప్రాయ సేకరణకు ఈ మీటింగ్ నిర్వహించగా దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అయితే జమిలీ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం ఉండవచ్చు. కానీ జాతీయ పార్టీలకు లాభం చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే కొద్దిరోజులుగా ఈ విషయం గురించి బయటికి రాలేదు. కానీ మోదీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతలో భాగంగా జమిలీ ఎన్నికలవైపు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఎన్నిప్రయత్నాలు చేసినా బీజేపీ గెలవడం లేదు. దీంతో గంపగుత్తగా మిగతా రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తోంది. అయితే జమిలీ ఎన్నికలపై పార్లమెంట్ లో చర్చ జరగొచ్చనే వాదన వినిపిస్తోంది. కానీ దీనిపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఇప్పుడే చెప్పలేమని కొందరు అంటున్నారు. కానీ తనకు అనుకూలమైన ఈ విధానాన్ని బీజేపీ ఆమోదం కోసం ప్రయత్నించే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఇప్పటికే ఇలాంటి సొంత ఎజెండాతో వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో జెట్ స్పీడుతో ఆమోదించి, ఆ తరువాత చట్టాలుగా మార్చారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వాటి పని కానిచ్చేశారు. అయితే రైతుల నుంచి ఏడాదికాలంగా వ్యతిరేకత రావడంతో ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వాటి రద్దు ప్రక్రియ చేస్తామని అంటున్నారు. అయితే ఇప్పుడు జమిలీ విధానాన్ని కూడా ఆయా పార్టీలతో సంబంధం లేకుండా అమలు చేస్తానని మోదీ అనుకుంటే వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లిన వైసీపీ జమిలి విధానాన్ని ఏ విధంగా స్వాగిస్తుందోనని అనుకుంటున్నారు. ప్రస్తతం మోదీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నా ఒక్కోసారి మోదీ నిర్ణయాలకు జై కొడుతున్నారు వైసీపీ నేతలు. అయితే జమిలీ ఎన్నికలు ప్రస్తావిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం