Homeజాతీయ వార్తలుCBSE Results 2026 Topper Cancer Survivor Story: క్యాన్సర్ తో పోరాడుతూనే .. సీబీఎస్ఈ...

CBSE Results 2026 Topper Cancer Survivor Story: క్యాన్సర్ తో పోరాడుతూనే .. సీబీఎస్ఈ ఫలితాలలో 96.6% మార్కులు.. ఇతడి సంకల్పానికి హాట్సాఫ్

CBSE Results 2026 Topper Cancer Survivor Story: ఉదయం మందులు వేసుకోవాలి. మధ్యాహ్నం అదే పని చేయాలి.. రాత్రి కూడా సేమ్ సీన్. ఒక్క టాబ్లెట్ కూడా మర్చిపోవడానికి లేదు. ప్రతి నెల చెకప్ కి వెళ్ళాలి. చెకప్ కు వెళ్ళిన ప్రతిసారి స్కూలుకు సెలవు పెట్టాలి.. చెకప్ కు వెళ్లిన సందర్భంగా రకరకాల స్కానింగ్లు.. శరీరాన్ని సూదులతో పొడిచినట్టు ఉండే కీమోతెరపి.. ఇన్ని ఇబ్బందులను అతడు ఎదుర్కొంటూనే చదువుకున్నాడు. శరీరం సహకరించకపోయినప్పటికీ చదువును దూరం పెట్టలేదు. చివరికి అతని కష్టం వృధా కాలేదు. అతడి శ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 96.6% మార్కులతో ఢిల్లీకి చెందిన ఆరవ్ వాట్స్ సత్తా చూపించాడు. వాస్తవానికి అతడు ఆ మార్కులు సాధించడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఎంతో శ్రమదాగి ఉంది. ఎందుకంటే అతడు సాధారణ పిల్లవాడు కాదు. ఇతడికి అత్యంత ప్రాణాంతకమైన లింపో ప్లాస్టిక్ లింఫోమా క్యాన్సర్ ఉంది. ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉంటుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కావు. ఒకవేళ ఉత్పత్తి అయినా సరే రోగ నిరోధక వ్యవస్థ లాగా పని చేయవు. దీనివల్ల. ఆరవ్ తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. కొన్ని సందర్భాలలో రాత్రి నిద్ర కూడా పోయేవాడు కాదు. తిండి సహించేది కాదు. మనిషి పీలగా అయిపోయేవాడు. ఇటువంటి స్థితిలో కన్న తల్లిదండ్రులు అతడికి చికిత్స అందించడం మొదలుపెట్టారు. క్యాన్సర్ వివరణ చికిత్స అనేది అత్యంత ఖరీదైనది. ఇబ్బందికరమైనది. వాటన్నిటిని తట్టుకొని ఆరవ్ చదువులో రాణించాడు. ఏకంగా 96.6% మార్కులు సాధించి సత్తా చూపించాడు.

క్యాన్సర్ తనను ఇబ్బంది పెట్టలేదని.. కొద్ది రోజులు తన లక్ష్యాన్ని ప్రభావితం చేసిందని.. తన సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయిందని ఆరవ్ చెబుతున్నాడు.. 96.6% ఫలితాలు సాధించిన తర్వాత.. తన కుటుంబ సభ్యులతో ఆ సందర్భాన్ని జరుపుకున్నాడు. అతడి తల్లిదండ్రులు ఒక కేక్ తీసుకొచ్చారు. వారి సమక్షంలో దానిని కట్ చేసి తన సంబరాన్ని జరుపుకున్నాడు. ఆరవ్ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో అతని గురించి చర్చ మొదలైంది.. ” అతడు నిజమైన యోధుడు. క్యాన్సర్ వ్యాధిని జయించాడు. ఆ వ్యాధి ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే తన ప్రయత్నాన్ని ఆపుకోలేదు. ఏకంగా సీబీఎస్ఈ లో 96.6% ఫలితాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అతడు ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. చావును జయించిన అతడి పట్టుదల భావితరాలకు స్ఫూర్తి పాఠం కావాలని” నెటిజన్లు చెబుతున్నారు.

తను సాధించిన ఫలితాల పట్ల ఆరవ్ మనస్ఫూర్తిగా సంతృప్తితో ఉన్నాడు.. తాను పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిందని భావిస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని.. తోటి విద్యార్థులు సహకరించారని.. తన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు కూడా తోడ్పాటు అందించారని.. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని ఆరవ్ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version