CBI- TRS: టిఆర్ఎస్ ఆర్థిక మూలాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్ పెట్టింది. 2023 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలోనూ టిఆర్ఎస్ కు ఆర్థిక సహకారం అందుకూడదనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన కరీంనగర్ గ్రానైట్ కంపెనీ యజమానులను లక్ష్యంగా చేసుకుంది. వారి వ్యాపారాల్లో అవక తవకలను మరింత లోతుగా తవ్వుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని కబురు పంపింది. గురువారం టిఆర్ఎస్ కీలక నాయకులు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.

అతడి అరెస్ట్ తో..
కొవ్విడి శ్రీను అలియాస్ ఢిల్లీ శ్రీను.. నకిలీ సిబిఐ అధికారిగా చెలా మణి అయ్యేవాడు. ఈ పేరుతోనే భారీగా ఆస్తులు కూడ పెట్టాడు. అయితే ఇటీవల సీబీఐ అధికారుల దాడుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..దీంతో అతడి ల్యాప్ టాప్ నుంచి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడ్డాయి. దీంతో కూపి లాగిన అధికారులకు అసలు విషయాలు తెలిసాయి.
కొవ్విడి శ్రీను అరెస్ట్ తో..
కొవ్విడి శ్రీను అలియాస్ ఢిల్లీ శ్రీను నీరా రాడియా టైపు. పెద్ద లాబీయిస్ట్. ఈడీ, ఐటీ అధికారులకు సన్నిహితంగా ఉంటాడు. పెద్ద పెద్ద పనులు చేసి పెడుతూ ఉంటాడు. అయితే ఇతడు రవిచంద్ర, కమలాకర్ కు ఎప్పటి నుంచో పరిచయస్తుడు. ఈ నేపథ్యంలో ఇటీవల కరీంనగర్ లో గంగుల కమలాకర్, రవిచంద్ర కంపెనీలపై ఈడి అధికారులు దాడులు చేయడంతో కలకలం చెలరేగింది. దీంతో వారు శ్రీను ను కలిశారు. లాబీయిస్ట్ గా పేరొందిన శ్రీను తన పనులు చక్కబెట్టుకునేందుకు నకిలీ సిబిఐ అధికారి అవతారం ఎత్తాడు. దీంతో ఈ విషయం అసలు సిపిఐ అధికారులకు తెలిసింది. వారు పకాగా కాపు కాసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.. అందులో వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, ఇతరుల పేర్లు ఉన్నాయి. దీనిపై అధికారులు కూపీ లాగగా…ఈడీ, ఐటీ అధికారులను మేనేజ్ చేసిందుకు గంగుల, వద్ది రాజు లంచాలు ఇవ్వాలని తనను ఆదేశించారని శ్రీను ఒప్పుకున్నాడు. దీంతో సీబీఐ అధికారులు కమలాకర్, రవిచంద్రకు నోటీసులు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ లో ఎదురయిన అనుభవాలతో నేరుగా ఢిల్లీ కి రమ్మని కబురు పంపారు. నేడు వారు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఓ వైపు ఈడి, మరోవైపు సీబీఐ…ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏమాత్రం బాగోలేనట్టుంది.

కూపీ లాగుతారా?
కొవ్విడి శ్రీను చెప్పిన వివరాలతో సీబీఐ అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం కొనుగోలు చేసిన విమానానికి భారీగా విరాళాలు ఇచ్చారు. పైగా గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారు. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రానైట్ వ్యాపారాన్ని విస్తరించారని సిబిఐ నోటీసులో ఉంది. కేవలం కొవ్విడి శ్రీను చెప్పిన ఆధారాలు మాత్రమే కాకుండా.. ఈ విషయాలపై కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. చైనా కంపెనీల నుంచి కమలాకర్, రవిచంద్ర కంపెనీలకు భారీగా నిధులు వస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా కూపీ లాగాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.