https://oktelugu.com/

Delhi Liquor Scam – Kejriwal : లిక్కర్ స్కాం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులిప్పించి షాకిచ్చిన బీజేపీ

Delhi Li1uor Scam – Kejriwal : బీజేపీ ఎవరిని వదలడం లేదు. అది తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు అయినా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయినా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరినీ ఇరికించేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్కూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ కేసులో అరెస్ట్ చేయించి జైలుకు పంపిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎంకే గురిపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీఎం కేజ్రీవాల్ కే నోటీసులు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2023 8:38 pm
    Follow us on

    Delhi Li1uor Scam – Kejriwal : బీజేపీ ఎవరిని వదలడం లేదు. అది తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు అయినా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయినా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరినీ ఇరికించేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్కూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ కేసులో అరెస్ట్ చేయించి జైలుకు పంపిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎంకే గురిపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీఎం కేజ్రీవాల్ కే నోటీసులు పంపి షాకిచ్చింది.

    ఈ ఆదివారం 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బీజేపీ నోటీసుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేజ్రీవాల్ ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ ఏకంగా ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న కేజ్రీవాల్ ను కేసులోకి లాగడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని బీజేపీ నియమించిన ఢిల్లీ లెప్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సీబీఐ కి లేఖ రాశారు. కేసీఆర్ నమోదు చేసిన సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను చేర్చింది.

    ఈ కేసులో ఇప్పటివరకూ సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోడా, మాగుంట రాఘవరెడ్డిలను అరెస్ట్ చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవల ఈడీ విచారించింది.

    ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎంకే గురిపెట్టి బీజేపీ షాకిచ్చింది. కేజ్రీవాల్ కు నోటీసులు పంపి దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించింది.

    ఇప్పటికే ఈడీ, సీబీఐ దాడులపై దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయి. అయినా బీజేపీ ఏం బెదరకుండా ఢిల్లీ సీఎంకే గురిపెట్టడం.. విచారణకు పిలవడం సంచలనమైంది.