సామాన్యుడికి హక్కు లేదా? రోడ్డుపై వెళ్తే దాడి చేయడమేనా? కరోనా టీకా వేసుకోవడానికి వెళ్తున్నానని చె ప్పినా వినకుండా విచక్షణ మరిచి ఓ జిల్లాకు కలెక్టర్ గా ఉన్నా స్థాయిని మరిచి పశువులా రెచ్చిపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీడియో కాస్త వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది. రోడ్డుపై వె ళుతున్న యువకుడిని ఆపి దాడి చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పౌరుడికి హక్కులు లేవా అని అడుగుతున్నారు. కలెక్టర్ చర్యలకు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
చత్తీస్ గడ్ లోని సూరజ్ పూర్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలపై ఓ యువకుడి పట్ల కలెక్టర్ రణబీర్ శర్మ దాష్టీకాన్ని ప్రదర్శించాడు. కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పినా వినకుండా అతడిపై చేయి చేసుకున్నాడు. యువకుడి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. కలెక్టర్ చర్యతో పక్కనే పోలీసులు కాస్త రెచ్చిపో యి లాఠీలతో బాదారు. శనివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో కలెక్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో లాక్ డౌన్ లో బయటకొచ్చిన కారణంగా యువకుడి పట్ల కలెక్టర్ వ్యవహరించిన తీరుకు అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అయింది. కలెక్టర్ తీరు నాటి బ్రిటిష్ కాలం నాటి తెల్లదొరల్లా అత్యంత నీచంగా ఉందని చీదరించారు. యువకుడి ఫోన్ పగులగొట్టడం, చెంప మీద కొట్టడం అనారిక చర్య అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి సంజీవ్ గుప్తా మండిపడ్డారు., సూరజ్ పూర్ జిల్లా క లెక్టర్ తీరుపై ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చత్తీస్ గడ్ లో ఇలాంటి వాటికి చోటు లేదు. యువకుడిని కొట్టినందుకు కలెక్టర్ తరఫున సారీ చెబుతున్నానని సీఎం పేర్కొన్నారు.
కలెక్టర్ రణబీర్ శర్మ స్పందిస్తూ యువకుడు సరైన సమాధానం చె ప్పలేకపోయేసరికి కోపం వచ్చి ఫోన్ విసిరికొట్టి చెంపమీద కొట్టాను అన్నారు. ఆ యువకుడి అనుచిత ప్రవర్తన నాకు కోపం తెప్పించింది. తొలుత వ్యాక్సిన్ తీసుకోవడానికి బయటకు వచ్చానని చె ప్పాడు. మళ్లీ తన నానమ్మను చూడటానికి వెళ్తున్నానని చెప్పాడు. పత్రాలు చూపించమంటే మొబైల్ ఫోన్ లో చూపించలేదు. అతడు మాట మార్చడం వల్లే కోపంతో కొట్టాను. ఇప్పుడు సారీ చెబుతున్నాను