Cattle On Roads: గోవులు తల్లితో సమానమని చెప్పే బీజేపీ నాయకులు చేతల్లో ఆ తెగువ చూపరు. మన్ కీ బాత్ లో ప్రతిసారీ గోవుల ప్రస్తావన తెచ్చే ప్రధాని మోదీ కూడా మాటలకే పరిమిత మవుతున్నారు. ఫలితంగా ఆయన సొంత రాష్ట్రంలో గోవులు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ మూగ జీవాలు ఎక్కడ తల దాచుకోవాలో తెలియక గుజరాత్ నడి వీధుల్లో సంచరిస్తున్నాయి. గోవుల సంరక్షణ కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ₹500 కోట్లు కేటాయించింది. కానీ నిధుల మంజూరులో మాత్రం శూన్య హస్తం చూపిస్తోంది. ఇంతకాలం గోవుల ఆలనా పాలన చూసిన గో సేవా సంఘ్ బాధ్యులు ఇక మా వల్ల కాదు అంటున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, ఆ నష్టాలు భరించలేక గోవులను వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, కోర్టు ప్రాంగణాల్లో గోవులను వదిలి పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

_ బడ్జెట్ లో హామీ ఇచ్చినా..
ఇటీవలి బడ్జెట్ లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గోవుల సంరక్షణకు ముఖ్య మంత్రి గో మాత పోషణ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. దీనికి 500 కోట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. గోవుల కోసం షెడ్లు నిర్మించి, వాటి ఆలనా పాలనా చూసే గో సేవా సమితులు, ట్రస్టులకు ఒక్కో ఆవుకు ₹30 చొప్పున ఇస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటన తో రాష్ట్ర వ్యాప్తంగా పలు ట్రస్టులు తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. 4.5 లక్షల ఆవుల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాయి. ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో వారంతా నిరసనలకు దిగారు.
Also Read: Nalgonda Rajagattu Revenue: 160 ఎకరాలకు ఓ రెవెన్యూ అధికారి స్కెచ్: ఆ అక్రమం బయటపడింది ఇలా
పెరిగిన ధరలతో తాము గోవులను సాకలేమని చెబుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాగా ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే తాము అక్టోబర్ 1 నుంచి గో రథ్ పేరుతో నిరసన ప్రదర్శనలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మాకు విరాళాలు రావడం లేదని గుజరాత్ గో సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి విపుల్ మాలీ అంటున్నారు. ప్రభుత్వం ఇలా మోసం చేస్తోందని కలలో కూడా ఊహించలేదని ఆయన చెబుతున్నారు. కాగా ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా 1,750 షెడ్లను గుజరాత్ గో సేవా సంఘ్ గోవుల కోసం నిర్మించింది. వీటిల్లో సుమారు 4.5 లక్షల గోవులు ఉంటున్నాయి.

– మాటలన్నీ ఉత్తవేనా
గోవుల గురించి భారీ ప్రసంగాలు, వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ నాయకులు.. చేతల్లో చూపించరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులు చెప్పేవన్నీ నిజాలు అయితే గోవులు ఇలా రోడ్ల మీదకు ఎందుకు వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గుజరాత్ గో సేవా సంఘ్ చేపడుతున్న నిరసన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఆప్ నేతలు కూడా గుజరాత్ గో సేవా సంఘ్ నాయకులకు మద్దతు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో పటేల్ రిజర్వేషన్లు ప్రధాన పాత్ర పోషిస్తే.. ఈసారి ఆ స్థానాన్ని గోవులు ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Mahesh Babu`s Mother Death: మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో రెండు విషాదాలు
[…] […]
[…] […]