Caste Politics: ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాసమస్యలను గాలికొదిలేసి కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్నటి దాకా డ్రగ్స్ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ తీరుపై మంత్రులు సైతం విరుచుకుపడటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం కుల ప్రస్తావనతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఏపీలో అనూహ్యంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం కీలకంగా మారింది. గుజరాత్ కేంద్రంగా మత్తు పదార్థాల రవాణా జరుగుతోంది. రూ.వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడినా నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా మారుతోందని విమర్శిస్తోంది. కులమే ప్రధానంగా మారడంతో వారిని రక్షిస్తోంది.
ఏపీ నుంచి తెలంగాణకు డ్రగ్స్ రవాణా జరుగుతోంది. సరిహద్దుల్లో గంజాయి పట్టుకున్నా అందులో అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ ఆరోపణలు చేసింది. అయినా కేసులో పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇందులో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడి పేరు వినిపించినా లాబీయింగ్ చేసి రాజకీయం చేసిందని టీడీపీ దుమ్మెత్తిపోసింది.
ఈ మధ్య ఏపీలో అన్ని విషయాల్లో కులమే ప్రధానంగా వినిపిస్తోంది. ఎవరినైనా తిట్టాలన్నా కులం పేరుతోనే చేస్తున్నారు. దీంతో కులమే బలంగా మారుతోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు మంత్రులే రంగంలోకి దిగి కుల ప్రస్తావన తెచ్చి మరీ తెగ తిడుతున్నారు. ఈ నేపథ్యంలో కులమే ప్రధానంగా మారి రాజకీయాలకు వెన్నెముకగా అయిపోతోంది.