‘ఓటుకు నోటు’: చంద్రబాబు బుక్కైనట్టేనా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆరోజు ఏం జరిగింది అన్నది స్టీఫెన్‌సన్ కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు ప్రక్రియను ఈనెల 6నుంచి ఏసీబీ కోర్టు కొనసాగించనుంది. మరోవైపు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ఏసీబీ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 10:23 am
Follow us on


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆరోజు ఏం జరిగింది అన్నది స్టీఫెన్‌సన్ కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు ప్రక్రియను ఈనెల 6నుంచి ఏసీబీ కోర్టు కొనసాగించనుంది. మరోవైపు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ఏసీబీ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేట్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటును కొనుగోలు చేసే క్రమంలో అడ్డంగా బుక్‌ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ వ్యవహారం కాస్త చంద్రబాబుకు ఇరకాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో భాగంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఎదుట నమోదు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చంద్రబాబు నాయుడు తనన కోరినట్లు.. తన వాళ్లు ఇచ్చే హామీలన్నింటినీ తాను నెరవేస్తున్నానని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తనకు చెప్పినట్లుగా స్టీఫెన్‌ సన్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మాట్లాడిన తర్వాత తనను తెలుగుదేశం క్రిస్టియ‌న్ సెల్ విభాగానికి చెందిన సెబాస్టియ‌న్ త‌న‌ను క‌లిశార‌ని, చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి త‌న ఇంటికి వ‌చ్చార‌ని వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం.

తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని రూ.5 కోట్ల ఆఫర్‌‌ ఇచ్చినట్లు.. రూ.50 లక్షల మొత్తంతో రేవంత్‌ తన వద్దకు వచ్చినట్లు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తాను ఏసీబీకి సమాచారం ఇచ్చి.. పట్టిచ్చినట్లుగా స్టీఫెన్‌ కోర్టుకు వివరించారని సమాచారం. ఈ వ్యవ‌హారంలో ఆది నుంచి చంద్రబాబు నాయుడి ఆడియో టేపులు సంచ‌ల‌నం రేపింది. ఆ ఆడియో టేపులు త‌న‌వి కావ‌ని ఎప్పుడూ చెప్పని చంద్రబాబు నాయుడు, త‌న ఫోన్ ను ఎలా ట్యాప్ చేస్తారంటూ అడ్డగోలుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా స్టీఫెన్ స‌న్ కూడా త‌న వాంగ్మూలంలో చంద్రబాబు నాయుడు త‌న‌తో మాట్లాడిన వైనాన్ని వివ‌రించ‌డంతో చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తున్నట్లునని అర్థమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్