Miss World 2021 Winner: ప్రపంచ సుందరికి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్ వరల్డ్ కావడానికి ముద్దుగుమ్మలు అంతా దేశదేశాల నుంచి పోటీ పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. 2021కి గాను 70వ మిస్ వరల్డ్ పోటీలు ప్యుర్తోలోకోలో నిర్వహించారు. కాగా ఈ పోటీల్లో ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు పోటీ పడ్డారు.
పోలాండ్ కి చెందిన కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ కిరీటం ఎగరేసుకుపోయింది. ఇదే పోటీల్లో పాల్గొన్న మన తెలుగు అమ్మాయి మానస వారణాసి కూడా చాలా కష్టపడింది. అయితే ఆమె సెమీఫైనల్స్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. సెమీఫైనల్స్ లో మానస అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో అంతకుమించి వెళ్లలేకపోయింది. అయితే సెమీఫైనల్స్ కు వెళ్లడం అంటే మాటలు కాదు.
Also Read: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?
సెమీ ఫైనల్స్ లో ఉన్న 13 మందిలో ఒకరుగా మానస గెలిచింది. 2021లోనే ఈ పోటీలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా నిబంధనల కారణంగా వాయిదా పడింది. అయితే పోలండ్ కు చెందిన భామ కరోలినా.. ప్రస్తుతం మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నట్లు వివరించింది. దాని తర్వాత పీహెచ్ డి కూడా చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తోంది.
ఇక మొదటి రన్నరప్ గా అమెరికాకు చెందిన శ్రీశైని నిలిచింది. పంజాబ్ లో జన్మించిన శ్రీశైని అమెరికాలో సెటిల్ అయ్యింది. అమెరికాలోని పోర్టోరికోలో నివసిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో అమెరికా తరుఫున పాల్గొంటున్న తొలి ఇండియన్ అమెరికన్ ఈమె. ఆమె అమెరికాలోనే జర్నలిజంలో బ్యాచ్ లర్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె తన తండ్రి కంపెనీలో బిజినెస్ మేనేజర్ గా చేస్తోంది.
ఇక రెండో రన్నరప్ గా కాట్ లివోరీ దేశానికి చెందిన ఒలీవియా నిలిచింది. ఇక 69వ మిస్ వరల్డ్ టోనీ- ఆన్ సింగ్ నుంచి కిరీటం అందుకునేటప్పుడు కరోలినా తీవ్ర భావోద్వేగానికి గురైంది. విన్నర్ గా తన పేరు ప్రకటించగానే షాక్ అయ్యానని.. ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను అంటూ తెలిపింది. ఈ ఘట్టం తన జీవితాంతం గుర్తుంచుకుంటాను అని తెలిపింది కరోలినా.
Also Read: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట