Nuclear Bombs : ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదం(Terroism) పెను సవాల్ గా మారింది. ఉగ్రవాదం మొత్తం ప్రపంచానికి తీరని సమస్య. మరి ఉగ్రవాదం అంత పెద్ద సమస్యగా ఉన్నప్పుడు ఏ దేశమూ అణు బాంబులతో ఉగ్రవాద శిబిరాలను శాశ్వతంగా ఎందుకు నాశనం చేయవచ్చు కదా అనే ప్రశ్న మీ మనసులోకి ఎప్పుడైనా వచ్చిందా.. ఉగ్రవాదులపై అణు బాంబులను ఎందుకు ఉపయోగించరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎన్ని దేశాల దగ్గర అణు బాంబులు ఉన్నాయి?
ముందుగా, ఎన్ని దేశాల వద్ద అణు బాంబులు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచంలోని 9 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో అమెరికా(America), రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా(China), భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ ఉన్నాయి. ఇందులో రష్యా, అమెరికా గరిష్ట సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. రష్యా వద్ద 5580 అణ్వాయుధాలు, అమెరికా వద్ద 5044 అణ్వాయుధాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచం మొత్తం మీద 12,121 అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిలో 90శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి.
ఉగ్రవాదులపై అణ్వాయుధాల వినియోగం
అణు బాంబుల వాడకానికి సంబంధించి నియమాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాల నిషేధ ఒప్పందాన్ని ఆమోదించింది. ఉగ్రవాదులపై అణు బాంబును ప్రయోగించడం మానవాళికి ప్రాణాంతకం, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అణు బాంబులు సామూహిక విధ్వంసం చేసే ఆయుధాలు. ఇప్పుడు ఏదైనా దేశం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే, అది దాని చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే దాని వాడకం నిషేధించారు. ఎందుకంటే అణు బాంబు ప్రభావాలు సంవత్సరాల తరబడి కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో సామూహిక విధ్వంసం జరుగుతుంది.
అణు పరీక్ష ఒప్పందం
ఆగస్టు 5, 1963న పరిమిత అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై మాస్కో(Masco)లో అమెరికా విదేశాంగ కార్యదర్శి డీన్ రస్క్ (1909-94), సోవియట్ విదేశాంగ మంత్రి ఆండ్రీ గ్రోమికో (1909-89), బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి అలెక్ డగ్లస్-హోమ్ (1903-95) సంతకం చేశారు. ఫ్రాన్స్, చైనాలను ఈ ఒప్పందంలో చేరమని అడిగినప్పటికీ, వారు నిరాకరించారు. ఇది కాకుండా ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలు చాలా ఉన్నాయి.
ఉగ్రవాదులు అణ్వాయుధాలను తయారు చేయగలరా?
ఇప్పుడు ఉగ్రవాదులు అణ్వాయుధాలను తయారు చేయగలరా అనే ప్రశ్న కూడా వచ్చిందా. వాస్తవానికి ఉగ్రవాదులకు అణ్వాయుధాలను తయారు చేయడానికి తగినంత సాంకేతికత, శాస్త్రీయ సామర్థ్యం లేదు. ఉగ్రవాదులు అణ్వాయుధాలను తయారు చేయడానికి ఫార్ములా, శాస్త్రవేత్తలను పొందినా వారు అమెరికా నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే అమెరికా ఉపగ్రహం ద్వారా అన్ని దేశాలపై నిఘా ఉంచుతుంది. అమెరికాతో పాటు, రష్యా, భారతదేశం, చైనా ఏజెంట్లు ప్రతి దేశంలోనూ ఉన్నారు.