
ఓ ఎంపీ అడ్డంగా బుక్కయ్యాడు. ల్యాప్ టాప్ లో కెమెరా ఆన్ లో ఉందని గ్రహించక అదే గదిలో బట్టలన్నీ విప్పి నగ్నంగా నిలబడ్డాడు. పార్లమెంట్ వర్చువల్ సమావేశానికి రెడీ అవుతూ ఇలా ఎంపీలందరి ముందు దిగంబరంగా నిలబడ్డ ఎంపీ పరువు పోయింది.
కెనడా దేశంలోని క్యూబెక్ జిల్లా పాంటియాక్ నియోజకవర్గ ఎంపీ విలయమ్ అమోస్ ఇలా నగ్నంగా జూమ్ మీటింగ్ లో కనిపించి తోటి ఎంపీలకు షాకిచ్చారు. ఆ సమయంలో ఆయనతో చేతిలో ఒక సెల్ ఫోన్ తప్ప ఒంటిపై నూలుపోగు లేదు.
జూమ్ మీటింగ్ మొదలు కావడం.. వీడియో ఆన్ లేదని రెడీ అవుతున్న ఎంపీగారి నగ్నత్వం అందరూచూసేసి దాన్ని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు. ప్రతిపక్ష నేతలు దీనిపై దుమ్మెత్తిపోశారు.
అయితే తాను అప్పుడే జాగింగ్ కు వెళ్లివచ్చానని.. కెమెరా ఆన్ అయ్యిందన్న విషయం తెలియక పార్లమెంట్ జూమ్ మీటింగ్ లో పాల్గొనేందుకు దుస్తులు మార్చుకుంటున్నానని ఎంపీ విలయం వివరణ ఇచ్చారు. తాను చేసిన తప్పుకు హౌస్ సభ్యులందరికీ క్షమాపణలు తెలియజేశాడు. మరొసారి ఇలా తప్పు చేయనని వివరణ ఇచ్చాడు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కెనడా పార్లమెంట్ సమావేశాలు ఈసారి జరగడం లేదు. వర్చువల్ గా జూమ్ లో జరుగుతున్నాయి. హౌస్ సభ్యులు సరైన దుస్తులు ధరించి అందులో పాల్గొనాలని కోరడంతో జాగింగ్ కు వెళ్లివచ్చిన ఎంపీ హడావుడిగా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిలబడ్డాడు. కొత్తదుస్తులు వేసుకుంటుండగా ఆయన నగ్నత్వం అందరికీ కనపడి పరువు పోయింది.
https://twitter.com/AndrewSaysTV/status/1382476411190059014?s=20