https://oktelugu.com/

Vaccine for children: పిల్లలకు టీకా వేయొచ్చా..? వేయకపోతే ఏం జరుగుతుంది..?

Vaccine for children: పెద్దలకు పూర్తయ్యింది. నడి వయసు వారికి, యువతకు టీకా అందింది. ఇప్పుడు పిల్లలకు టీకా కార్యక్రమం మొదలుకాబోతోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల్లో బోలెడన్నీ భయాలు, అనుమానాలు గూడుకట్టుకున్నాయి. వ్యాక్సిన్ల దుష్ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు టీకా ఎలా పనిచేస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మరి పిల్లలకు టీకాలు వేయాలా? వేస్తే ఎవరికి వేయాలి? ఎంతవరకూ వేయొచ్చు? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2021 / 10:19 AM IST
    Follow us on

    Vaccine for children: పెద్దలకు పూర్తయ్యింది. నడి వయసు వారికి, యువతకు టీకా అందింది. ఇప్పుడు పిల్లలకు టీకా కార్యక్రమం మొదలుకాబోతోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల్లో బోలెడన్నీ భయాలు, అనుమానాలు గూడుకట్టుకున్నాయి. వ్యాక్సిన్ల దుష్ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు టీకా ఎలా పనిచేస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మరి పిల్లలకు టీకాలు వేయాలా? వేస్తే ఎవరికి వేయాలి? ఎంతవరకూ వేయొచ్చు? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    vaccine for children

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా వృద్ధులకు, ఆ తరువాత మధ్య వయస్కులకు టీకాలు వేస్తున్న దేశాలు ఇక పిల్లలకు కూడా ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. ఈ నవంబర్ నుంచి పిల్లలకు టీకా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే చాలా దేశాల్లో ట్రయల్స్ నిర్వహించి వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికీ చాలా మందిలో ఇంకా అనుమానాలున్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీర్ఘకాలిక జబ్బలు బయటపడుతుండడంతో కొందరు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ ప్రభుత్వాలు నిర్బంధ టీకాలు వేయడంతో అనుకున్న లక్ష్యానికి చేరువవుతోంది. ఈ తరుణంలో పిల్లకు టీకాలు ఇస్తే ప్రభావం ఎలా ఉంటుందోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

    టీకా వేసుకోకపోవడంతో ఇప్పటికీ అనేక దేశాల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వారి చదువులు ఏడాదిన్నరగా అటకెక్కాయి. 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభించాయి. వీరిపై టీకా ప్రభావం ఉంటుందా..? అన్న ప్రశ్నకు కొవిడ్ కంటే పెద్ద ప్రమాదకరమైందేమీ కాదంటున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ దేశం మొదట్లో వృద్ధులకు ఆ తరువాత వయోజనులకు వేసింది. గత జూన్ నుంచి పాఠశాలలు ప్రారంభయ్యాక 12 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను వీరికి అందించారు. ఇప్పటి వరకు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి సగం మందికి టీకాలు వేసింది.

    ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో కొంతమంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో అక్టోబర్ నాటికి 12-15 సంవత్సరాల పిల్లలకు 53.7 శాతం, 16-19 సంవత్సరాల వారికి 84 శాతం మందికి టీకాలు అందించింది. వీరంతా ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. పిల్లలు వైరస్ బారిన బడుతారనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. అందుకే ఈ శాతం పెరిగింది.

    అయితే చిన్న పిల్లలకు టీకా వేయడంలో జాగ్రత్తలు కూడా అవసరమని స్విట్జర్లాండ్ బేసెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలుపుతున్నారు. సాధారణంగా పుట్టిన పిల్లలకు ఏడాదికే టీకాలు వేస్తుంటారు. కరోనా టీకా కూడా అలాగే వేయడం కుదరదంటున్నారు. ఎందుకంటే మరింత చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ సురక్షితమని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగున్నాయని వారు పేర్కొన్నారు. 5 నుంచి 16 వయసున్న వారిలో టీకా సమర్థవంతంగా పనిచేసినా మరీ చిన్నపిల్లల్లో మాత్రం సమస్యలు ఉండవని నిర్ధారించలేమని తెలిపారు.

    అంతకుముందు ఇజ్రాయెల్ వృద్దులకు 90 శాతం వ్యాక్సినేషన్ వేసిన తరువాత కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ సెప్టెంబర్లో పాఠశాలలు తెరిచిన తరువాత కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. కొందరు చిన్నారులు ఒకరోజు స్కూలుకు వెళ్లినా కొవిడ్ బారిన పడ్డారు. దీంతో పిల్లలకు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ ఒక్కటే అని భావించి టీకాల జోరు పెంచింది. జనాభాలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ ను నియంత్రించవచ్చని అక్కడి వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

    వైరస్ సోకి తగ్గిన పిల్లల్లోనూ దీర్ఘకాలిక సమస్యలు ఉంటున్నాయి. తలనొప్పి, అప్పుడప్పుడు జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మూడు నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో కొవిడ్ నుంచి కోలుకున్నా.. నిద్రలేమి, ఏకాగ్రత లేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకా తప్పనిసరి అని అంటున్నారు. అయితే వీరికి టీకా వేసే క్రమంలో కొన్ని వైద్య, నైతిక, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.