https://oktelugu.com/

AP Cabinet Ministers resignation బ్రేకింగ్: 24మంది ఏపీ మంత్రుల రాజీనామా.. ఐదారుగురికే తిరిగి ఛాన్స్?

AP Cabinet Ministers resignation : ఏపీ సీఎం జగన్ సంచలనానికి నాంది పలికారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ ముగియగానే 24మంది మంత్రుల రాజీనామాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందజేసినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ెదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని డిసైడ్ అయ్యారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 / 05:55 PM IST
    Follow us on

    AP Cabinet Ministers resignation : ఏపీ సీఎం జగన్ సంచలనానికి నాంది పలికారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ ముగియగానే 24మంది మంత్రుల రాజీనామాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందజేసినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ెదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని డిసైడ్ అయ్యారు.

    ఇక రాజీనామా చేసిన మంత్రులను జగన్ బుజ్జగించినట్టు సమాచారం. తమ అధికారం పోవడంతో ప్రొటోకాల్ సమస్య వస్తుందని.. తమను ఎవరూ పట్టించుకోరని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసి వారికి న్యాయం చేస్తానని జగన్ వివరించినట్టు తెలిసింది.

    రాజీనామా చేసిన మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగిస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ మిలిట్ మిషన్ తోపాటు డిగ్రీ కాలేజీల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    ఇక మంత్రివర్గం ముగిసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. 24మంది మంత్రులు రాజీనామా చేశామని.. ఇందులో ఐదారుగురు మాత్రమే మళ్లీ రెన్యూవల్ అయ్యి తిరిగి రెండోసారి మంత్రులుగా కొనసాగుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇక రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.