తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని అధికారులు సీఎం కేసీఆర్ కు నివేదించారు.
వైద్య అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలు అధికారులను కేబినెట్ ఆదేశించింది. అయితే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ గడువు శనివారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గం సమావేశమైంది.. మంత్రులందరికీ కేసీఆర్ ఫోన్ చేసి మరీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
తెలంగాణలో కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. శనివారం ఈ మేరకు కీలక సమావేశంలో నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ తోపాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేసి జనాలు గుమిగూడకుండా.. రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు కేసీఆర్ సర్కార్ నియంత్రణలు పెట్టేందుకు యోచిస్తోంది. థియేటర్లు, మబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొనసాగనుంది. వివాహాలు, అంత్యక్రియల లాంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది.
కరోనా థర్డ్ వేవ్ పై కూడా ఈ సమావేశం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ మినహాయింపునకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. మాస్కులు, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేల కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కూడా కేసీఆర్ ఈ మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పై సమగ్ర ప్రణాళిక కూడా రూపకల్పన చేసేందుకు రెడీ అయ్యారు.