By Election Results
By Election Results: దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. వాటి ఫలితాలను శనివారం(జూలై 13న) ప్రకటించింది. మొత్తం 13 స్థానాల్లో 10 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంది. రెండు స్థానాల్లో ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. సాధారణ ఎన్నికలు మరియు ట్రెండ్‌ను అంచనా వేయడానికి ఉప ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు. అయితే ప్రతి పక్షం తమ సౌలభ్యం మేరకు దాన్ని ఉపయోగిస్తుంది. ఇది బీజేపీ ప్లస్ మరియు కాంగ్రెస్ ప్లస్ రెండింటికీ సమానంగా ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా సంతోష వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన నెల రోజుల్లో జరిగిన బైపోల్స్‌లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిజంకా కాంగ్రెస్ సంబరాలు చేసుకునేందగా బీజేపీ లేదా ఎన్డీఏ కూటమిపై వ్యతిరేకత ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏడు రాష్ట్రాలు.. 13 స్థానాలు..
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కో స్థానానికి ఎన్నికల సంఘం బై పోల్ నిర్వహించింది. ఇటీవల నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు.
పంజాబ్‌లో ఆప్ విజయం..
పంజాబ్‌లోని జలంధర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్థానిక అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇది ఆప్ స్థానమే. ఉప ఎన్నికల్లో ఆస్థానాన్ని త్రిముఖ పోటీ మధ్య జలంధర్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆప్ కైవసం చేసుకుంది. 37,325 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.
హిమాచల్ ప్రదేశ్‌లో మూడూ కాంగ్రెస్ సీట్లే..
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు కాంగ్రెస్ స్థానాలే. అయితే ఇక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉప ఎన్నిల్లో కాంగ్రెస్‌వైపే ప్రజలు మొగ్గు చూపారు. దీంతో మూడు స్థానాలను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఇక్కల కాంగ్రెస్ సంబరాలు చేసుకోవాల్సిందే. దెహ్రా అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌సింగ్ భార్య కమలేష్ ఠాకూర్. ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సత్తా..
ఇక దీదీ మమతాబెనర్జీ అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికార టీఎంసీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ ఆధిపత్యం చాటుకుంది. తాజాగా అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ సత్తా చాటింది. ఇక్కడ ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో 3 బీజేపీ సిట్టింగ్ సీట్లు. ఉప ఎన్నికల్లో ఆ మూడింటిని కూడా టీఎంసీ తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంలో కాంగ్రెస్ పాత్ర లేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో..
ఇక ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్, మంగళూర్ అసెంబ్లీ స్థానాలను ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినా ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటింది. బద్రీనాథ్ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవాలోనూ బద్రీనాథ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఉప ఎన్నికల్లోనూ తిరిగి దానిని నిలబెట్టుకుంది. ఇక మంగళూర్ పూర్తిగా ముస్లిం నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ ఎప్పుడూ గెలవేలదు. ముస్లిం ఓట్లు ఇప్పుడు బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌కు మారాయి. అంటే.. ఇక్కడ కూడా కాంగ్రెస్ కాస్త సత్తా చాటినట్లే చెప్పుకోవాలి.
తమిళనాడులో అధికార పార్టీ విజయం..
ఇక అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన దక్షిణాది రాష్ట్రం తమిళనాడు ఇక్కడి విక్రవాండి అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార డీఎంకే ఘనవిజయం సాధించింది. ఈ సీటు గతంలో కూడా డీఎంకేదే. ఉప ఎన్నికల్లో దానిని తిరిగి నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదు.
మహారాష్ట్రలో యూబీటీ గెలుపు..
ఇక మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతత్వంలోని శివసేన, కాంగ్రెస్ కూటమి యూబీటీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ ఇద్దరూ కలిసి పోటీ చేయకపోయిం ఉంటే ఓడిపోయేవారు. కూటమిగా పోటీచేసి విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ గెలుపు కానే కాదు.
బిహార్‌లో..
ఇక బిహార్‌లో మాత్రం ఇండియా కూటమికి చెందిన జేడీయూ అభ్యర్థి విజయం సాధించాడు. రూపాలి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార జేడీయూ నిలబెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ జేడీయూ సత్తా చాటింది. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ ఇండియా కూటమి మూడో స్థానానికి పరిమితమైంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా కాంగ్రెస్ ఎక్కడా ఒంటరిగా గెలవలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు స్థానాలు కాంగ్రెస్‌వే. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తన బలమైన పట్టును నిలుపుకోవడంలో విఫలమైంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మొత్తంమీద, ఇది ఏకపక్ష ఫలితం కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ నష్టపోయాయి. ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా పని చేయగలిగాయి. కానీ కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒంటరిగా కాంగ్రెస్ గెలవకపోయినా కూటమి విజయానికి కూడా కాంగ్రెస్ నేతలే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: By election results india alliance wins 10 out of 13 seats
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com