https://oktelugu.com/

పిల్లల్ని కంటే మీకు ఏదంటే అదీ.. ఎంతమంచి ఆఫర్..

మన తాతల కాలం నాటి ముచ్చట.. అప్పుడు పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక్కొక్క ఇంట్లో 9, 10 మంది వరకు సంతానం ఉండేది. అయినా కూడా ఎంతో సంతోషంగా ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. ఇప్పుడు కేవలం భార్య భర్త, వారి పిల్లలు, నానమ్మ, అమ్మమ్మలు దూరమే. పట్టణాల్లో బంధీ ఖానాల్లాగా చిన్న కుటుంబాలు వెలిశాయి. అప్యాయతలు అనురాగాలు దూరమైపోయాయి. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడంతో సమాజంలో కూడా అనర్థాలు పెరిగిపోయాయి. వెనుకటిలా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2021 3:27 pm
    Follow us on

    మన తాతల కాలం నాటి ముచ్చట.. అప్పుడు పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక్కొక్క ఇంట్లో 9, 10 మంది వరకు సంతానం ఉండేది. అయినా కూడా ఎంతో సంతోషంగా ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. ఇప్పుడు కేవలం భార్య భర్త, వారి పిల్లలు, నానమ్మ, అమ్మమ్మలు దూరమే. పట్టణాల్లో బంధీ ఖానాల్లాగా చిన్న కుటుంబాలు వెలిశాయి. అప్యాయతలు అనురాగాలు దూరమైపోయాయి. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడంతో సమాజంలో కూడా అనర్థాలు పెరిగిపోయాయి. వెనుకటిలా ఇప్పుడు ఐదుగురు ఆరుగురిని జంటలు కనడం లేదు. కేవలం ఒకరు ముద్దు.. లేదంటే ఇద్దరు. అంతకుమించి పిల్లలనే కనడం లేదు. దీంతో జనాభా పడిపోయి కొన్ని దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. వృద్ధులతో పనులు సాగక ఆ దేశాల వృద్ధి రేటే పడిపోతున్న పరిస్థితి నెలకొంది.

    ఒక దేశ అభివృద్ధికి జనాభా పెరుగుదల ఆటంకం సృష్టిస్తుంది. దేశంలో ఉన్న ఆర్థిక వనరులు అక్కడున్న జనాభాకు సమతుల్యం కాదని కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తారు. అయితే జనాభా తగ్గుదల కూడా దేశ ఆర్థిక వృద్ధిరేటును తగ్గిస్తుందని తాజాగా అంచనాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే అధిక జనాభా ఉన్న దేశాలు సైతం మరోసారి తమ జనాభాను మరింతగా పెంచుకునేందుకు వివిధ ప్లాన్లను అమలు చేస్తున్నాయి. దీంతో కొందరు అసలు విషయం తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ జనాభా పెరుగుదలకు ఆ దేశాలు తీసుకుంటున్న చర్యలేమిటి..? ఎందుకు జనాభాను పెంచాలనుకుంటున్నాయి.

    ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. ఇప్పటికే 130 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉంది. అయితే జనాభాను తగ్గించేందుకు గతంలో కొన్ని షరతులను విధించింది. దీంతో జనాభా విపరీతంగా తగ్గుదల కనిపించింది. కానీ దేశంలో అత్యధికంగా వృద్ధులు ఉంటే ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం పడుతుందని తెలుసుకుని పునరుత్పత్తికి అవకాశాలిచ్చింది. అంతేకాకుండా పునరుత్పత్తిలో ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తోంది. పిల్లలను కనేందుకు చైనాతో పాటు అమెరికా కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    జపాన్ లోని నాగి చో అనే చిన్న పట్టణంలో జననాల సంఖ్య భారీ స్థాయిలో తగ్గింది. దీంతో 9 సంవత్సరాల నుంచి అక్కడి కుటుంబాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పిల్లలు కన్న కుటుంబాలకు బేబీ బోనస్లు, పిల్లల అలవెన్స్లు ప్రకటిస్తోంది. దీంతో ఇక్కడ జననాల వృద్ధి అధికంగా కనిపించింది. అయితే పిల్లల చదవులపై మాత్రం జాతీయ వృద్ధిరేటులో సగం ఖర్చవుతుంది.

    ఇక జననాల పునరుత్పత్తి రేటులో అత్యధికంగా తక్కువగా ఉన్న దేశం దక్షిణ కొరియా. ఈ దేశంలో పిల్లల్ని కనడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశం 130 బిలియన్ డాలర్లు అందుకోసం వెచ్చించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల్ని కనడానికి ప్రత్యేకంగా సెలవులను కూడా మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తున్నా కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాల్లో పిల్లల్ని పెంచడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఇలాంటి చోట్ల ప్రోత్సాహకాలను ఎక్కువగా అందించదని అనుకుంటున్నానని దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జియో సియోల్ అనే మహిళ పేర్కొంది.

    మొత్తంగా జనాభాను నియంత్రించడాన్ని దేశాలు ఉపసంహరించుకుంటున్నారు. జనాలు పిల్లలను కనకపోవడంతో వృద్ధులు పెరిగిపోయి పనిచేసే యువత తగ్గిపోతోంది. తద్వారా దేశ జాతీయ ఉత్పత్తి రేటు, సామర్థ్యాలు పడిపోతున్నాయి. అందుకే పిల్లలను కనాలని మళ్లీ జంటలను వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.