Buddhadeb Bhattacharjee Padma Bhushan: భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేసేందుకు సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే ఆయన మాత్రం తాను ఆ అవార్డుకు తగిన వాడిని కాదని తిరస్కరించారు. అవార్డును తీసుకోవడం లేదని ప్రకటించారు. తనకు ఏ అవార్డు అక్కర్లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బుద్ధదేవ్ భట్టాచార్య ప్రస్తుతం సీపీఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పద్మభూషణ్ అవార్డు గురించి తనకేమీ తెలియదని చెబుతున్నారు. ఎవరైనా తనకు అవార్డు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానని చెబుతుండటం తెలిసిందే. దీంతో పద్మభూషణ్ అవార్డు తనకు అక్కర్లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకెవరికైనా ఇవ్వాలని సూచిస్తున్నారు.
గతంలో కూడా జ్యోతిబసుకు భారతరత్న ఇవ్వాలని భావించినా ఆయన కూడా నిరాకరించారు. తనకు ఏ అవార్డు వద్దని చెప్పారు. దీంతో ప్రస్తుతం పద్మ అవార్డుల ప్రకటనపై అనుమానాలు వస్తున్నాయి. ఇదంతా రాజకీయ స్టంట్ గా పేర్కొనడం గమనార్హం. దీంతో పద్మ అవార్డుల ప్రకటన వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.
Also Read: విరిసిన మన ‘పద్మాలు’: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల సక్సెస్ స్టోరీ తెలుసా..?
మొత్తం 128 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశారనే వాదనలు కూడా వినిపిస్తన్నాయి. ప్రస్తుతం బద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరించడం చర్చనీయాంశం అవుతోంది.
దేశంలో అత్యంత సేవలందించిన వారికి అందజేసే పద్మ పురస్కారాల ఎంపికలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అవార్డుల కోసం అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలోనే లోపం ఉందని తెలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రకటనపై ఇంత స్థాయిలో రాద్ధాంతం జరగడం ఇదివరకు లేదు. కానీ ఈసారి మాత్రం అవార్డుల ఎంపికపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై బహిరంగంగాంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: ఆశ్చర్యపరిచిన మోడీ.. బిపిన్ కు పద్మ విభూషణ్.. సుందర్ పిచయ్, సత్యనాదెళ్లకు పద్మ భూషణ్