Undavalli Arunkumar- KCR: దేశ రాజకీయాలు మార్చలన్న సంక్పంలో భారతీయ రాష్ట్రసమితిని స్థాపించాలని డిసైడ్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రేఖర్‌రావు పార్టీ కార్యవర్గానికి తుది రూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ గుర్తు, జెండా టీఆర్‌ఎస్ వే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక జాతీయ కార్యర్గం అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ కార్యవర్గాల ప్రకటనపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.

ఏపీలో ఆయనే బాస్..
బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ కొనసాగుతారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పగ్గాలు కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవల్లికి కాంగ్రెస్‌లో మంచి ప్రాధాన్యం ఉండేది. ఆయన మరణం తర్వాత పార్టీపరంగా ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉండవల్లి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అప్పుడప్పుడూ తాజా రాజకీయాలపై ప్రెస్‌మీట్లు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. గతంలో జనసేన పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా చేరలేదు. తాజాగా జాతీయ రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో కేసీఆర్ స్థాపించబోతున్న బీఆర్‌ఎస్‌కు ఏపీలో ఉండవల్లినే బాస్ చేయాలని కేసీఆర్ నిర్ణయించనట్లు తెలిసింది.
Also Read: AP MPs: కండోమ్ రెడ్డి, విగ్ రాజా.. ఛీఛీ.. దిగజారిపోయిన ఏపీ ఎంపీలు!

బీజేపీ వ్యతిరేకి అయిన ఉండవల్లిని బీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడం ద్వారా ఏపీలో మంచి పట్టు దొరుకుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఉండవల్లికి కాంగ్రెలో ఉన్న సన్నిహితులు కూడా బీఆర్‌ఎస్‌లోకి చేరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని బలమైన నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకునే అవకాశాలు ఎరక్కువగా కనిపిస్తున్నాయి. ఈమేరకు కొంతమంది నాయకులతో కేసీఆర్ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఉండవల్లిపై ఎలాంటి మచ్చ లేకపోవడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, ముక్కుసూటితనం, బోలాగా మాట్లాడే వ్యక్తిత్వం ఉండడంతో కేసీఆర్ ఉండవల్లిని బీఆర్‌ఎస్‌లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
బీహార్ పగ్గాలు పీకేకు..
బీహార్ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పగ్గాలు ఎన్నికల వ్యూహకర్త పీకేకే అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనను బీఆర్‌ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కొంతమంది పీకేను బీహార్‌కు పరిమితం చేయరని, జాతీయ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. బీపేపీలో మోదీ – షా ద్వయంలాగా, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ పీకే ద్వయం పార్టీ బలోపేతం, చేరికలు, ఎన్నికల్లో విజయానికి వ్యూహరచనలు చేస్తారని తెలుస్తోంది.
Also Read:Schools Reopen In Telangana: తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు.. నిబంధనలివీ