Homeఆంధ్రప్రదేశ్‌BRS Focus On AP: ఏపీ పై బీఆర్ఎస్ ఫోక‌స్.. టార్గెట్ జ‌న‌సేన‌, టీడీపీనా ?

BRS Focus On AP: ఏపీ పై బీఆర్ఎస్ ఫోక‌స్.. టార్గెట్ జ‌న‌సేన‌, టీడీపీనా ?

BRS Focus On AP: ఏపీ పై బీఆర్ఎస్ ఫోక‌స్ పెరుగుతోంది. విస్త‌ర‌ణ దిశగా వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. కేసీఆర్ మార్కు రాజ‌కీయాలు ఏపీలో మొద‌లుకానున్నాయి. కేసీఆర్ కూత‌రు, ఎమ్మెల్సీ క‌విత కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ పావులు క‌దుపుతోంది. భారీ బ‌హిరంగ స‌భ‌కు కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

BRS Focus On AP
BRS Focus On AP

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన త‌ర్వాత కేసీఆర్ ఫోక‌స్ అంతా ఏపీ పైనే పెట్టారు. తెలుగు రాష్ట్రం కావ‌డం, పాత ప‌రిచ‌యాలు ఉండ‌టం కార‌ణంగా పార్టీ విస్త‌ర‌ణ‌, బ‌లోపేతం సులువు అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ నేత‌ల‌ను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. ఏపీలోని అసంతృప్త నేత‌ల‌ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి, భారీగా చేరిక‌లు ప్రోత్స‌హించేందుకు కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు.

ఏపీ పై ఫోక‌స్ లో భాగంగా త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత‌కు ఏపీ బాధ్య‌తలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ క‌విత ఏపీ బీఆర్ఎస్ నేత‌ల‌తో స‌మావేశ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈనెల 19న ఖ‌మ్మం బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ తర్వాత ఏపీ స‌భ పై దృష్టి పెడ‌తార‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 29న క‌ల్వ‌కుంట్ల క‌విత ఏపీలో ప‌ర్య‌టించ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

BRS Focus On AP
BRS Focus On AP

ఏపీలో ఇత‌ర పార్టీ నేత‌ల‌తో పాటు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు బీఆర్ఎస్ కారు ఎక్కే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌ల్లో టికెట్ ద‌క్క‌ని వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాల‌ని భారీ స్కెచ్ వేస్తోంది. జ‌న‌సేన‌, టీడీపీ ల‌క్ష్యంగా బీఆర్ఎస్ భారీ యాక్ష‌న్ ప్లాన్ రూపొందించుకుంద‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల త‌ర్వాత కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల పై పూర్తీ స్థాయి ఫోక‌స్ పెడ‌తార‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version