BRS vs Congress : వేటాడుతున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతలంతా జైలుకే

అక్రమాలను ధ్రువీకరించుకున్నాక కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లను, పలువురు నేతలను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

Written By: Raj Shekar, Updated On : January 30, 2024 9:00 pm
Follow us on

BRS vs Congress : కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పట్టు బిగిస్తోంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి.. ఆ పార్టీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు అండగా నిలిచారు. కనుసైగతో పోలీసులను శాసింశారు. మంత్రి అండతో కార్పొరేటర్ల నుంచి చోటామోటా లీడర్ల వరకు రెచ్చిపోయారు. సామాన్యులను ఆస్తులను బలవంతంగా దోచుకున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వివాదాలు సృష్టించి సెటిల్‌మెంట్‌ పేరుతో దందాలు చేశారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారు మారు కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది.

వేట మొదలు పెట్టిన పోలీసులు..
ఇన్నాళ్లూ మంత్రి ఎంత చెబితే అంత అనే పోలీస్‌ అధికారులు ఇక్కడ పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాడని సీపీ సుబ్బారాయుడుపై ఈసీ వేటు వేసింది. దీంతో అభిషేక్‌ మహంతి సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో సీన్‌ మొత్తం మారిపోయింది. గంగుల మంత్రిగా ఉన్న సమయంలో కబ్జాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతల భరతం పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్‌ఎస్‌ బాధితులు హైదరాబాద్‌ ప్రజాభవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఫిర్యాదులను కరీంనగర్‌ సీపీకి పంపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అభిషేక్‌ మహంతి బీఆర్‌ఎస్‌ నేతల వేట సాగిస్తున్నారు. కబ్జా నేతల కోసం ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేసి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. అక్రమాలను ధ్రువీకరించుకున్నాక కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లను, పలువురు నేతలను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

రౌడీషీట్‌ ఓపెన్‌..
బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్‌పై కరీంనగర్‌ పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. ఐదు క్రిమిలన్‌ కేసుల్లో నిందితుడిగా ఉండడంతో రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు తెలిపారు. ఓ రిటైర్డ్‌ టీచర్‌ భూమి సేఫ్‌గా ఉంటాలంటే రూ.40 లక్షలు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వలేదని ఆ స్థలం గుండా రోడ్డు వేయించాడు. దీంతో యజమాని రాజీకి రాక తప్పలేదు. ఈ క్రమంలో సదరు టీచర్‌ రూ.10 లక్షలు ముట్టజెప్పాడు. అందులో రూ.2 లక్షలు అతని కూతురు ఖాతాకు బాధితుడు బదిలీ చేశాడు. రూ.8 లక్షలు నేరుగా ఇచ్చాడు. ఈమేరకు బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్‌ డబ్బులు డిమాండ్‌ చేసిన వీడియో కూడా పోలీసులకు అందించాడు. ఈ క్రమంలో సాగర్‌ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతడికి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపింది. సాగర్‌పై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. జంగిలి సాగర్‌పై క్రైం నంబర్ 515/2011లో సెక్షన్ 447, 186 r/w 34 ఐపీసీ, క్రైం నంబర్ 90/2022లో సెక్షన్ 427, 290, 324 r/w 34 IPC, 0 0 164/2023 5 147, 148, 452, 427 r/w 149 IPC, 30 సెక‌్షన్‌ 31/2024, 5 447, 427, 386, 506 IPC, సెక‌్షన్‌ 35/2024, §5 386, 506 IPC కేసు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీస్ మాన్యూవల్ నంబర్‌ 600-1 ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు తెలిపారు.