https://oktelugu.com/

Rishi Sunak or Liz Truss రిషి సునక్, ట్రస్.. ముఖాముఖి లో ఎవరు గెలిచారు?

Rishi Sunak or Liz Truss : బ్రిటన్ కాబోయే ప్రధానిగా భారత సంతతి రిషి సునక్ నా? లేక బ్రిటన్ జాతీయురాలు లిజ్ ట్రస్ నా? అనేది తేల్చేందుకు.. వారి వాదన వినేందుకు తొలిసారి వీరిద్దరి మధ్య ముఖాముఖి టీవీ చర్చను నిర్వహించారు. ఇది ఆద్యంతం రక్తకట్టింది. బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి, లిజ్ లు తొలి చర్చలో హోరాహోరీగా పాల్గొని వాదులాడుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికలపై ఇద్దరు నేతల […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2022 9:18 am
    Follow us on

    Rishi Sunak or Liz Truss : బ్రిటన్ కాబోయే ప్రధానిగా భారత సంతతి రిషి సునక్ నా? లేక బ్రిటన్ జాతీయురాలు లిజ్ ట్రస్ నా? అనేది తేల్చేందుకు.. వారి వాదన వినేందుకు తొలిసారి వీరిద్దరి మధ్య ముఖాముఖి టీవీ చర్చను నిర్వహించారు. ఇది ఆద్యంతం రక్తకట్టింది. బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి, లిజ్ లు తొలి చర్చలో హోరాహోరీగా పాల్గొని వాదులాడుకున్నారు.

    ముఖ్యంగా ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా మాట్లాడారన్న దానిపై ‘ఒపీనియన్ పోల్’ నిర్వహించారు. ఇందులో రిషి సునక్ కు 39 శాతం ఓట్లు, లిజ్ ట్రస్ వైపు 38 శాతం మంది మొగ్గు చూపారు.

    ఈ ఓటింగ్ ప్రకారం.. బ్రిటన్ ప్రజలు రిషి, లిజ్ మధ్యలో ఎవరిని విజేతగా అనుకుంటున్నారన్నది విస్పష్టంగా చెప్పలేకపోయారు. ఇక పార్టీ పరంగా చూస్తే కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో ఏకంగా 47 శాతం మంది లిజ్ ట్రస్ బాగా మాట్లాడారని పేర్కొన్నారు. కేవలం 38 శాతం మంది మాత్రమే మన రిషి సునాక్ వైపు మొగ్గు చూపారు.

    రిషి సునక్-లిజ్ ట్రస్ మధ్య టీవీ డిబేట్ కొనసాగుతున్న సమయంలో యాంకర్ మూర్చపోయారు. డయాస్ పై యాంకర్ కేట్ మెక్ కాన్ సొమ్మసిల్లారు. ఇది ప్రత్యక్ష ప్రసారం కూడా అయ్యింది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో టీవీ డిబేట్ ను రద్దు చేయాల్సి వచ్చింది. దీన్ని మరోసారి నిర్వహిస్తామని కన్జర్వేటివ్ పార్టీ తెలిపింది.

    ఇక వాదులాటల సంగతి పక్కనపెడితే ప్రధానిని ఎన్నుకునే కన్జర్వేటివ్ పార్టీలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్ కే మొగ్గుచూపుతున్నారు. ఇక ప్రజల కోణంలోంచి చూస్తే తాజాగా ‘అడ్స్ చెకర్’ అనే సంస్థ సర్వే నిర్వహించగా.. దాదాపు 75 శాతం మంది ట్రస్ బ్రిటన్ ప్రధానిగా ఎంపిక అవుతారని పేర్కొన్నారు. ఇక యువగవ్ అనే మరో సంస్థ కూడా లిజ్ ట్రస్ నే ప్రధాని కావడం పక్కా అని తేల్చారు.

    దీంతో మనల్ని పాలించిన బ్రిటన్ ను మన వాడు పాలించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడం కల్లే. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.