UPI services : బిగ్ బ్రేకింగ్: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?

దేశవ్యాప్తంగా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవల్లో స్తబ్దత ఏర్పడింది. ఫలితంగా నగదు చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంది. కొన్ని ప్రాంతాలలో నగదు బట్వాడా కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 9:12 pm

UPI

Follow us on

UPI services : కోవిడ్ తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బ్యాంకుల్లోకి వెళ్లి గంటలకు గంటలు ఎదురుచూసే బదులు ప్రజలు డిజిటల్ విధానంలోనే చెల్లింపులు జరుపుతున్నారు. నగదు స్వీకరించడం, పంపించడం, గ్యాస్ బుకింగ్ నుంచి సినిమా టికెట్ కొనుగోలు చేయడం వరకు ఇలా ప్రతి విషయాన్ని డిజిటల్ విధానంలో చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవుతోంది. సేవలో కచ్చితత్వం ఉంటోంది. అందువల్లే ప్రజలు డిజిటల్ విధానంలో చెల్లింపులు జరుపుతున్నారు. డిజిటల్ చెల్లింపులను కేంద్ర ఆధీనంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పర్యవేక్షిస్తోంది. అయితే అప్పుడప్పుడు డిజిటల్ చెల్లింపుల్లో జాప్యం ఏర్పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. డబ్బు పంపించడం, స్వీకరించడం అనే విషయాలను పక్కన పెడితే కనీసం బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అప్పట్లో యూపీఐ లో టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్ వేర్ దాడి జరిగింది. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. మనదేశంలో ప్రతిరోజు డిజిటల్ విధానంలో వందల కోట్లల్లో చెల్లింపులు జరుగుతాయి. అప్పట్లో యూపీఐ సేవలు నిలిచిపోవడంతో.. లావాదేవీలు ఆగిపోయాయి.

సీ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నప్పటికీ..

మనదేశంలో పలు బ్యాంకులకు సీ ఎడ్జ్ టెక్నాలజీస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఆ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్ వేర్ దాడి చోటుచేసుకుంది. అప్పట్లో మన దేశంలోని 3 బ్యాంకులకు సంబంధించిన చెల్లింపు వ్యవస్థలు ఎక్కడికి ఎక్కడ ఆగిపోయాయి. దీనిపై సీ ఎడ్జ్ టెక్నాలజీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించకపోయినప్పటికీ.. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. ఫలితంగా సేవలు పునరుద్ధరణకు గురయ్యాయి.. అయితే అప్పట్లో రిటైల్ పేమెంట్స్ సిస్టం తో సీ ఎడ్జ్ టెక్నాలజీస్ ను వేరు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే సమస్య ఎదురయింది. అయితే ఈసారి ర్యాన్సమ్ వేర్ దాడి జరిగి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించలేదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మాత్రం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంది. అయితే దేశంలో కొన్ని ప్రాంతాలలో పేమెంట్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్య అని, త్వరలోనే పరిష్కారం అవుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెల్లింపులు నిలిచిపోగా.. కనీసం బ్యాలెన్స్ కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు.. ఏదో ర్యాన్సమ్ వేర్ దాడి జరిగి ఉంటుందని.. అందువల్లే సేవల్లో స్తబ్దత ఏర్పడిందని వినియోగదారులు అంటున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంస్థకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.