సున్నాన్ని చూసి బ్లీచింగ్ అనుకుంటార్లే..!

బ్లీచింగ్ కొనుగోళ్ళలో చిన్న చితక చిలక్కొట్టుళ్ళు గ్రామ పంచాయితీల్లో చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. కరోనా కాలంలో బ్లీచింగ్ పేరుతో రూ. కోట్ల మొత్తంలో కుంభకోణం వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు బహిరంగ ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల నుంచి రూ.70 కోట్లు పైబడి నకిలీ బ్లీచింగ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. కుంభకోణం ఎలా జరిగిందంటే..తెల్ల సున్నానికి బ్లీచింగ్ వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మేశారు […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 2:48 pm
Follow us on

బ్లీచింగ్ కొనుగోళ్ళలో చిన్న చితక చిలక్కొట్టుళ్ళు గ్రామ పంచాయితీల్లో చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. కరోనా కాలంలో బ్లీచింగ్ పేరుతో రూ. కోట్ల మొత్తంలో కుంభకోణం వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు బహిరంగ ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల నుంచి రూ.70 కోట్లు పైబడి నకిలీ బ్లీచింగ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

కుంభకోణం ఎలా జరిగిందంటే..తెల్ల సున్నానికి బ్లీచింగ్ వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మేశారు గుంటూరు జిల్లా వ్యాపారులు.

కుంభకోణం ఎలా జరిగిందంటే..తెల్ల సున్నానికి బ్లీచింగ్ వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మేశారు గుంటూరు జిల్లా వ్యాపారులు. పిడుగురాళ్ల నుంచి కాకినాడకు బ్లీచింగ్ సరఫరా జరిగినట్లు సమాచారం. బ్లీచింగ్ సరైంది కాదంటూ కాకినాడ కలెక్టర్‌ దృష్టికి కింది స్థాయి అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై వెంటనే గుంటూరు కలెక్టర్‌కు కాకినాడ కలెక్టర్ సమాచారం అందజేశారు. దీనిపై విచారణ జరుపగా అసలు పిడుగురాళ్లలో బ్లీచింగ్ తయారీ కంపెనీ లేదని గుర్తించారు. గుంటూరు జిల్లాలో కూడా ఇదే నకిలీ బ్లీచింగ్ సరఫరా అయినట్లు గుర్తించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ విచారణకు ఆదేశించారు. పిడుగురాళ్లలో 2 రోజుల క్రితం సున్నం మిల్లులో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బ్లీచింగ్ ఇక్కడి నుంచే సరఫరా చేశారా అనే సందేహాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా విచారణ జరుపుతున్నారు.