వేలమంది వాడిన దుప్పటి మనది…!

రైళ్లలోని ఎయిర్ కండిషన్డ్ బోగీల్లో ప్రయాణంలో చేసేటప్పుడు రైల్వేవారు ఇచ్చే దుప్పట్లను ఉపయోగిస్తుంటాం. అలాంటివారందరికి ఈ సమాచారం షాక్ ఇస్తుంది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు వినియోగించే నలుపు లేదా గోధుమ రంగులో వుండే మందపాటి దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారట. సుమారు 83 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించిన తర్వాత మాత్రమే ఉతుకుతారట. ఈ సమాచారం ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా రైల్వే శాఖ తెలియజేసింది. 64 ఏళ్ల జతిన్ దేశాయ్ […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 4:47 pm
Follow us on

రైళ్లలోని ఎయిర్ కండిషన్డ్ బోగీల్లో ప్రయాణంలో చేసేటప్పుడు రైల్వేవారు ఇచ్చే దుప్పట్లను ఉపయోగిస్తుంటాం. అలాంటివారందరికి ఈ సమాచారం షాక్ ఇస్తుంది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు వినియోగించే నలుపు లేదా గోధుమ రంగులో వుండే మందపాటి దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారట. సుమారు 83 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించిన తర్వాత మాత్రమే ఉతుకుతారట. ఈ సమాచారం ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా రైల్వే శాఖ తెలియజేసింది. 64 ఏళ్ల జతిన్ దేశాయ్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని రైల్వే శాఖ నుండి అడిగారు.

ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ ‘నేను చాలా సార్లు రైళ్లలో ప్రయాణించాను. రైళ్ళలో మురికి, చిరిగిన దుప్పట్లు చూసాను. అందుకే నా స్నేహితుడు తన సొంత దుప్పటితో అతనితో ప్రయాణిస్తుంటాడు. రైళ్లలో ఇచ్చిన దుప్పట్లు శుభ్రంగా వున్నాయంటే అతను నమ్మడు. అటువంటి పరిస్థితిలో ఈ దుప్పట్లు ఎప్పుడెప్పుడు ఉతుకుతారో తెలుసుకోవాలనుకున్నాను, అందుకే ఆర్టీఐకి దరఖాస్తు చేశానని తెలిపారు. కాగా ఈ విషయమై సిపిఆర్ఓ రవీందర్ భఖర్ మాట్లాడుతూ ఉన్ని దుప్పట్లు ఉతికితే పాడవుతాయి. గతంలో ఈ దుప్పట్లు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉతికేవారు. కాని ఇప్పుడు ప్రతి నెలా ఉతుకుతున్నారు. రోజూ ఉన్ని దుప్పట్లు ఉతకడం సాధ్యం కాదని చెప్పారు.