కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా ఏంటో అధికార టీఆర్ఎస్ కు గట్టిగానే రుచిచూపించారు.
Also Read: కేసీఆర్‌కు ఆ సలహాలు ఎవరిస్తున్నారు.. ఎందుకు నమ్ముతున్నారు..?
తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారు స్పీడుకు బీజేపీ బ్రేకులు వేసింది. దీంతో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు కాషాయతీర్థం పుచ్చకున్నారు.
అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యాక తొలిసారి ఆయనకు షాక్ తగిలింది. బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
Also Read: కొత్త సచివాలయం.. కేసీఆర్ మళ్లీ మార్చాడు
అనివార్య కారణాలతో బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఓ లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే తన రాజీనామాను మీడియా ముఖంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ బలపడుతున్న సమయంలో ఓ జిల్లా అధ్యక్షుడు పదవీ నుంచి తప్పుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఎర్ర శేఖర్ రాజీనామాపై బండి సంజయ్ ఎలా రియాక్టవుతారే వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్