BJP Fight Against TRS: బీజేపీ టీఆర్ఎస్ పై పోరాటం ఉధృతం చేయాలని చూస్తోంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీల వివరాలు కావాలని సహ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇన్నాళ్లు టీఆర్ఎస్ బీజేపీపై చేస్తున్న పోరాటానికి దీటైన సమాధానం చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎన్ని హామీలిచ్చారు? ఎన్ని నెరవేర్చారు? ఎన్ని హామీలుగానే మిగిలిపోయాయి అనే వాటిపై ఆధారాలు సేకరిస్తున్నారు.

బీజేపీ తన మనుగడ కోసం అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలపై దృష్టి సారిస్తోంది. ఊరకే బీజేపీని నిందిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ను కడిగేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సమాచార హక్కు చట్టం కింద 86 రకాల దరఖాస్తులు చేసుకుని వాటి వివరాల కోసం ఆరా తీస్తోంది. సర్కారును ఇరుకున పెట్టే క్రమంలో దూసుకుపోతోంది. హైదరాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభ సక్సెస్ తో బీజేపీ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్ ను ఓ రకంగా డైలమాలో పడేయాలని చూస్తున్నారు.
Also Read: Bhavadeeyudu Bhagat Singh: భవదీయుడు భగత్ సింగ్ లో మరో క్రేజీ హీరో
ఇప్పటికే మంత్రి కేటీఆర్ బీజేపీని విమర్శిస్తున్న సందర్భంలో కాషాయదళం కూడా సరైన రీతిలో స్పందిస్తోంది. వివిధ పథకాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలు తీసుకుని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని భావిస్తోంది. మీడియా సంస్థలకు ఇచ్చే ప్రకటనలపై కూడా లెక్కలు సేకరిస్తున్నారు. జూన్ 2014 నుంచి జూన్ 2022 వరకు ఇచ్చిన హామీలు, చేసిన పనులు తదితర వివరాలపై లెక్కలు తీసుకుంటున్నారు.
Also Read: Kanyakumari MP Pen Lost: ఎంపీగారి పెన్ను పోయిందా? విచారణ చేస్తున్న పోలీసులు