BJP New Parliamentary Board: ఇప్పటికే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి బీజేపీ వ్యవస్థాపకుల్లో కొందరిని సాగనంపిన మోడీ-షాల ద్వయం తాజాగా బీజేపీలో కీలకమైన పార్లమెంటరీ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్న సీనియర్లను కూడా పక్కనపెట్టి సంచలనం సృష్టించింది. మోడీ మొదటి కేబినెట్ లోని బీజేపీ యాక్టివిస్టులందరినీ తొలగించిన మోడీ-షాలు కేవలం.. రెబల్ బీజేపీ నేత నితిన్ గడ్కరీని మాత్రం ముట్టుకోలేదు. రెండో కేబినెట్ లోనూ ఆయనకు పదవి ఇచ్చారు. అయితే పార్టీ వ్యవహారాల నుంచి దూరం పెట్టేశారు. రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, మేనకాగాంధీ, ఉమాభారతి సహా చాలా మంది పదవులు కోల్పోయి.. పార్టీలోనూ లేకుండా పోయారు. ఇప్పుడు గడ్కరీ, చౌహాన్ పరిస్థితి కూడా అదే కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు బీజేపీ పార్టీ విధాన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోంచి తీసేయడం సంచలనమైంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులోంచి గడ్కరీ, చౌహాన్ లను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది.
Also Read: AP Capital Issue: ఏపీని వీడని రాజధానుల రగడ.. కథ క్లైమాక్స్ కు వచ్చినట్టేనా?
పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా నేతృత్వంలో బోర్డు ఏర్పాటు చేశారు. బీజేపీలోని ప్రతి నిర్ణయం ఈ బోర్డు తీసుకుంది. సభ్యులుగా మోడీ, అమిత్ షా, యడ్యూరప్ప, రాజ్‌నాథ్ లాంటి సీనియర్లను ఉంచారు. కమిటీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ తొలగింపు సంచలనమైంది. బోర్డు నుంచి నితిన్ గడ్కరీకి కూడా ఉద్వాసన పలకడం దుమారం రేపింది. ఇక తెలంగాణకు మాత్రం పెద్దపీట వేసింది. తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్ కు ఇందులో చోటు కల్పించడం విశేషంగా మారింది.
మొత్తం 11 మందితో బీజేపి నూతన పార్లమెంటరీ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఇందులో జేపీ నడ్డా,నరేంద్ర మోడీ,రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప,సర్వానంద్ సోనోవాలా,కె లక్ష్మణ్,ఇక్బాల్ సింగ్ లాల్‌పురా,శ్రీమతి సుధా యాదవ్,సత్యనారాయణ్ జటియా, బీఎల్ సంతోష్ లు ఉన్నారు.
ఇలా తమకు అనుకూలమైన వారికి అగ్రతాంబూలం వేస్తూ.. అనుకూలంగా లేనివారిని తొలగిస్తూ బీజేపీలో మోడీ షాల ద్వయం ముందుకు సాగుతోందని కొందరు రగిలిపోతున్నారు. బీజేపీలో యాక్టివిస్టులను లేకుండా చేస్తున్నారని.. కేవలం తమకు అడుగులకు మడుగులు ఒత్తే వారినే ఉంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read:AP teachers Concern : ఉపాధ్యాయులను వదిలించుకొనే జగన్ కుట్ర..