https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌పై బీజేపీ సీబీఐ అస్త్రం

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే.. టీఆర్‌‌ఎస్‌పై ఎప్పటికప్పుడు యుద్ధం ప్రకటిస్తూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శల అస్త్రం సంధిస్తూనే ఉంది. అందుకే.. మాటిమాటికి సీబీఐ జపం చేస్తోంది బీజేపీ. మిషన్ తెలంగాణను పెట్టుకున్న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా తెలంగాణ పర్యటనకు వచ్చి నేరుగా కేసీఆర్ కుమార్తె కవితకు హెచ్చరికలు జారీ చేశారు. Also Read: ఉన్నట్టుండి జగన్‌కు అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చినట్లు..? సింగరేణి బెల్ట్‌లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2021 / 02:13 PM IST
    Follow us on


    తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే.. టీఆర్‌‌ఎస్‌పై ఎప్పటికప్పుడు యుద్ధం ప్రకటిస్తూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శల అస్త్రం సంధిస్తూనే ఉంది. అందుకే.. మాటిమాటికి సీబీఐ జపం చేస్తోంది బీజేపీ. మిషన్ తెలంగాణను పెట్టుకున్న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా తెలంగాణ పర్యటనకు వచ్చి నేరుగా కేసీఆర్ కుమార్తె కవితకు హెచ్చరికలు జారీ చేశారు.

    Also Read: ఉన్నట్టుండి జగన్‌కు అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చినట్లు..?

    సింగరేణి బెల్ట్‌లో పర్యటించిన తరుణ్ చుగ్.. అక్కడ కార్మిక యూనియన్లలో పట్టు పెంచుకున్న కవితను టార్గెట్ చేశారు. యూనియన్‌ లీడర్‌గా ఎమ్మెల్సీ కవిత అంతా తన చేతిలో పెట్టుకున్నారని.. ఎమ్మెల్సీ కవితకు తానిచ్చే మెసేజ్‌ ఒకటేనని.. దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టదని హెచ్చరికలు జారీ చేశారు. మరో అడుగు ముందుకేసి టీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

    బండి సంజయ్ కూడా అంతకుముందు అదే పనిగా సీబీఐ గురించి మాట్లాడేవారు. తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని.. కోర్టులో పిటిషన్లు వేస్తామని చెప్పేవారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామనే వారు. కేసీఆర్‌‌కు ఎప్పటికైనా జైలు జీవితం తప్పదని హెచ్చరించేవారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ నోట.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమనే మాటలు రావడం కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ నేరుగా కవితకు హెచ్చరికలు జారీ చేశారు.

    Also Read: ఈవోను వదిలి.. కింది స్థాయి ఉద్యోగుల బలి

    సైలెంట్‌గా ఉంటే బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతారని ఇటీవల కాలంలో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. అవి కంట్రోల్‌లోనే ఉంటున్నాయి. తరుణ్ చుగ్‌ను ఏమీ అనకుండా రొటీన్ విమర్శలు చేసిన బండి సంజయ్ పై ప్రభుత్వ విప్ సుమన్ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి కాస్త ఆలస్యమైనా బీజేపీ మళ్లీ సీబీఐ బెదిరింపులు ప్రారంభించిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. వీటన్నింటిపై టీఆర్‌‌ఎస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్