https://oktelugu.com/

MODI: బీజీపీ ‘కశ్మీర్’ వ్యూహం.. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమేనా..?

MODi : ఒకసారి మోడీ వేసిన ప్లాన్ మరోసారి వర్కవుట్ అవుతోందా? దేశ ప్రజలు నమ్ముతారా? అది రిపీట్ అవుతుందా? అంటే ఏమో చెప్పలేం అంటున్నాయి రాజకీయవర్గాలు.. భావోద్వేగాల దేశభక్తి రాజకీయం 2019లో మోడీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చింది. భారతదేశ చరిత్రలోనే ఏ ప్రధాని సాహసించని విధంగా ఏకంగా పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన మోడీ ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు. మరోసారి ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నాడు. పథకాలు, సంక్షేమం, పాలన, వ్యతిరేకత అంతా  ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2021 / 09:29 AM IST
    Follow us on

    MODi : ఒకసారి మోడీ వేసిన ప్లాన్ మరోసారి వర్కవుట్ అవుతోందా? దేశ ప్రజలు నమ్ముతారా? అది రిపీట్ అవుతుందా? అంటే ఏమో చెప్పలేం అంటున్నాయి రాజకీయవర్గాలు.. భావోద్వేగాల దేశభక్తి రాజకీయం 2019లో మోడీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చింది. భారతదేశ చరిత్రలోనే ఏ ప్రధాని సాహసించని విధంగా ఏకంగా పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన మోడీ ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు. మరోసారి ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నాడు. పథకాలు, సంక్షేమం, పాలన, వ్యతిరేకత అంతా  ఈ ‘జాతీయ భావం’లో కొట్టుకుపోయాయి. మోడీ వేసిన ప్లాన్ సూపర్ గా పనిచేసింది. మళ్లీ ఇప్పుడు అదే కథ మొదలైంది. మరోసారి జమ్మూకశ్మీల్ లో అలజడి.. పాకిస్తాన్ పై సర్జికల్స్ స్ట్రైక్ చేస్తామన్న అమిత్ షా ప్రకటన చూస్తుంటే.. మరోసారి ఈ సెంటిమెంట్ తో రాబోయే ఉత్తరప్రదేశ్, గుజరాత్ లను టార్గెట్ చేశారా? వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దీన్నే అస్త్రంగా మోడీ షా చేసుకోబోతున్నారా? అంటే ఔననే చర్చ సాగుతోంది.

    జమ్మూకాశ్మీర్లో ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో ఇటు జవాన్లు, అటు ఉగ్రవాదులు చనిపోతున్నారు. అయితే ఒక్కో సందర్భంలో అమాయకులపైన పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదులు కశ్మీర్ కు వలస వచ్చిన వారినే తాజాగా లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ కు వలస వచ్చిన 9 మందిని హత్య చేయడం సంచలనమైంది. ఇటీవల జమ్మూకశ్మీర్ ను విభజించి ప్రత్యేక ప్రతిపత్తిని ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రంగా మార్చి అక్కడ దేశంలోని ప్రజలందరికీ కేంద్రం హక్కులు కల్పించింది. ఇప్పుడు కేంద్రం చేసిన పనితో కశ్మీర్ కు పెట్టుబడులు, వలసలు మొదలయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులు స్థానికేతరులను ఏరివేస్తున్న వైనం కలకలం రేపుతోంది. ఇందుకు నిదర్శనంగా తాజా దాడులు అని తెలుస్తోంది.

    కశ్మీర్ కు స్వేచ్ఛ కల్పించిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడికి వచ్చిన ఇతర రాష్ట్రాల వారిపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి ఈ దాడులు ఇలాగే కొనసాగితే మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదని పాకిస్తాన్ నుసైతం హెచ్చరించారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేసి కాశ్మీర్ లోకి పంపుతోందని, ఇలాగే కొనసాగితే చర్యలు తీసుకోక తప్పదన్నారు.

    బీజేపీ ప్రభుత్వానికి ప్రతీసారి ఎన్నికల సమయంలోనే సర్జికల్ స్ట్రైక్ గుర్తుకొస్తాయని దరు అంటున్నారు. గతంలోనూ పార్లమెంట్ ఎన్నికల సమయంలో సెర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకున్నారంటున్నారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకే అమిత్ షా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని అంటున్నారు. త్వరలో ఉత్తరప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టీ మరీ సెటైర్లు వేస్తున్నారు.

    జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా వాతావరణం కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కొందరు విదేశాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆర్థికంగా, సమాజికంగా జమ్మూకశ్మీర్ ను అభివృద్ధి చెందేందుకు పెట్టుబడుదారులకు అవకాశం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగా అక్కడ పటిష్ట వాతావరణాన్ని కల్పిస్తోంది.

    అయితే అప్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తరువాత కశ్మీర్ లో పరిస్థితులు పూర్తిగా మారాయి. కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అంటున్నారు. అప్ఘాన్ అండతో ఉగ్రవాదులను భారత్ పైకి పాక్ ఉసిగొల్పుతుందని, తద్వారా జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించేందుకు యత్నిస్తోందని అంటున్నారు. కానీ భారత భద్రతా దళాలు ధీటుగా స్పందించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారంటున్నారు. కానీ ఉగ్రవాదుల ఆగడాలు ఇలాగే కొనసాగితే మరోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని అమిత్ షా హెచ్చరించారు.

    గతంలోనే జమ్మూలోని పూల్వామాలో 40 మంది వరకూ భారత్ సైనికులను ఉగ్రవాదులు హతమార్చిన ఘటన తరువాత భారత్ రగిలిపోయింది. ఈ దాడిలో చాలా మంది జవాన్లను పోగొట్టుకున్న భారత్ అందుకు ప్రతీకారాన్ని తీర్చుకుంది. 2019 సెప్టెంబర్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. పాక్ నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల శిబిరంపై దాడులు చేసింది. బాలకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై యుద్ధవిమానాలతో విరుచుకుపడింది. ఇందులో 12 యుద్ధ విమానాలను వాడినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

    తాజాగా అలాంటి చర్యలే తీసుకోవాల్సి వస్తోందని అమిత్ షా హెచ్చరించారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అమిత్ షా మరోసారి ప్రజల పై సెంటిమెంట్ అస్త్రాన్ని వదులుతున్నారని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలు సెంటిమెంట్ తో బీజేపీకి ఓట్లు వేస్తారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దేశంలో పెట్రోల్ ధరలు, నిరుద్యోగం ప్రభలుతోందని, అలాంటి వాటిపై నిలదీయకుండా ఉండడానికే బీజేపీ నాయకులు సర్జికల్ స్ట్రైక్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్లమెంట్ ఎన్నికల వరకు ఇలాగే సెంటిమెంట్ తో గెలుస్తారని అంటున్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సమర్థిస్తున్నారు.