MLA Raja Singh Suspended: పార్టీ గొప్పదా? ధర్మం గొప్పదా? అంటే తనకు ధర్మం గొప్పదని అంటున్నారు రాజాసింగ్.. పార్టీ చెట్టునీడలో ఎదిగినా సరే ధర్మం కోసం కాంప్రమైజ్ కానని చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ‘మహ్మద్ ప్రవక్తపై’ నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్టకు ముప్పులా మారాయి. ఆమెను సస్పెండ్ చేసి చేతులు దుపులుకుంది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు రాజాసింగ్ అంతకుమించిన మాటలతో కాకరేపారు. ఈయనపై కూడా బీజేపీ వేటు వేసింది. కానీ ధర్మం కోసం పార్టీనే ధిక్కరిస్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు సస్పెండ్ చేశారని అందరూ ఆరాతీస్తున్నారు.
–బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ కేంద్ర శిక్షణ సంఘం సస్పెండ్ చేసింది. పార్టీ రాజ్యాంగానికి ఉల్లంఘన పాల్పడ్డట్టు పేర్కొన్న కమిటీ.. పది రోజులపాటు వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని సూచించిన కేంద్ర కమిటీ. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని సూచించింది.
-సస్పెన్షన్ ను ముందే ఊహించిన రాజాసింగ్.. సంచలన కామెంట్స్
సస్పెన్షన్ ను ముందే ఊహించిన రాజాసింగ్ ఈ మేరకు తనకు పార్టీ కంటే ధర్మమే ముఖ్యమని ముందుకెళుతానంటున్నాడు. శనివారం మునావర్ ఫారుకీ షో ను అడ్డుకుని తీరుతామన్న రాజసింగ్.. ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని కామెంట్స్ చేశాడు. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మ మాదిరిగా నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చని స్పష్టం చేశారు. నేను సస్పెండ్ అయినా మోదీ, అమిత్ షాలకు ఫాలోవర్ గా ఉంటానని తెలిపారు.
-రాజాసింగ్ మొండి పట్టుదల
రాజాసింగ్ ఇలా ఒక మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు ఎంఐఎం నుంచి ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పును ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదులకు టార్గెట్ గా కూడా మారారు.రాజాసింగ్ ను హతమారుస్తామని సోషల్ మీడియాలో కూడా బెదిరింపులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. అయినా కూడా తన హిందుత్వ ధర్మాన్ని, సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా ముందుకెళుతున్నాడు. ఎంఐఎం నేతలు, ఆ వర్గంతో ఢీ అంటే అంటే ఢీ అంటున్నాడు. తాజాగా వారి మత ప్రవక్తపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ కంటే .. ధర్మాన్ని కాపాడటమే నాకు ముఖ్యం అని స్పష్టం చేస్తున్నారు. నేనన చేయబోయే వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని శనివారమే చెప్పిన రాజాసింగ్
ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని కామెంట్స్ చేయడం విశేషం.
నా వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మ మాదిరిగా నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చని రాజాసింగ్ సవాల్ చేయడం కూడా సంచలనమైంది. పార్టీ కంటే కూడా తనకు తన సిద్ధాంతాలే ముఖ్యమని రాజాసింగ్ మొండిగా ముందుకెళుతున్నారు. పార్టీ కంటే .. ధర్మాన్ని కాపాడటమే నాకు ముఖ్య అంటున్నారు.
మొత్తంగా రాజాసింగ్ తీరు ఒక వర్గాన్ని.. బీజేపీని ఇరుకునపెట్టినా ఆయన చుట్టూ ఉన్న వారిని.. నియోజకవర్గ ప్రజల్లో మాత్రం హీరోగా మార్చేసింది. వారితో మొండిగా కొట్లాడే ఒక బలమైన నేతగా ప్రొజెక్ట్ చేస్తోంది. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతకైనా తెగించే నేతగా రాజాసింగ్ ఈ చర్యతో మరోసారి వార్తల్లో నిలిచారు.