BJP-TDP alliance : ‘నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది’ అన్నట్టు ఉంటాయ్ కొన్నిసార్లు రాజకీయాలు. దేశం అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం అయితే బావుండు అని విపక్షాలు గోల పెడుతున్న సమయంలో ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ అంటూ ‘నేషనల్ మీడియా’ గోడ మీదకెక్కి మరీ కోడై కూస్తోంది! అది కూడా ‘రిపబ్లిక్ న్యూస్ చానెల్’ లాంటి బీజేపీ మౌత్ పీస్ చెబుతోంది. ప్రింట్ మీడియాలో ఎడిటోరియల్స్ అయిపోయాయ్ ఆల్రెడీ. ఏంటి మేటర్ ? చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలో చేరతాడా ? అసలు ప్లాన్ ఏంటన్నది ఆసక్తిగా మారింది.
-ఎందుకీ ప్రచారం ? మూడు కారణాలు ఉన్నాయ్.
1. ఆపరేషన్ తెలంగాణ
2. నితీశ్ స్లాట్ ఖాళీ – నేషనల్ ఫేస్ కావాలి
3. ఆంధ్రాలో చంద్రబాబుకి అవసరం
ఈ మూడు కలిపి మళ్లీ కలుపుతున్నాయ్ టీడీపీ – బీజేపీలను అనుకోవచ్చు. బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది. కేసీఆర్ విలవిల ఆల్రెడీ చూస్తున్నాం. అక్కడ సెటిలర్ ఓట్లు, టీడీపీకి మిగిలి ఉన్న ఓట్లు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ కి నష్టం. కేసీఆర్ కి లోతైన దెబ్బ. బీజేపీకి లాభం ఉండొచ్చు. అందుకే అవసరం. ఇక రెండోది ఎన్డీయే యాంగిల్. మొన్నటి వరకూ పెద్దమనిషి నితీశ్ ఉన్నాడు. ఇప్పుడు లేడు. చల్ గయా. అందుకే ప్రాంతీయ పార్టీల్లో పెద్ద తలకాయ కావాలి. అవసరమైతే మద్దతు కూడగట్టే కెపాసిటీ ఉన్నోడు ఉండాలి. చంద్రబాబు తప్ప మరో ఆప్షన్ లేదు. ఈ రెండూ బీజేపీ యాంగిల్లో చూస్తే కరెక్టే!
ఇక ఏపీ విషయానికి వస్తే జనంలో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా, ఎదుటి వికెట్ ఎంత వీక్ అయినా… యంత్రాంగం సపోర్ట్ కావాలి. అది లేకపోతే కష్టమే అని రోజు రోజుకీ అర్థం అవుతోంది. అందుకే చంద్రబాబుకి బీజేపీ, కేంద్రం అవసరం ఉంటుంది. కాకపోతే పరోక్షంగా మద్దతు తీసుకొని – పవన్ తో కలిసి పోటీ చేస్తే బావుంటుంది అని ఆలోచనలు మొన్నటి వరకూ ముసిరాయ్ కానీ తెలంగాణ ఎన్నికలు ఆంధ్రా కన్నా ముందు. అక్కడ టీడీపీ కావాలి కాబట్టి బీజేపీ నేరుగా లింకు కోరుకునే ఛాన్సు ఉంటుంది. రిపబ్లిక్ చెబుతున్నది ఇదే !
-మరి మిగతా పార్టీలేమంటాయో?
ప్రాంతీయ పార్టీలన్నీ గొలుసుకట్టులా పట్టుకొని బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నెక్ట్స్ టైమ్ రాకుండా ఆపాలని అనుకుంటున్నాయ్. బీహార్ నుంచి మొదలు పెట్టి నితీశ్ జనతా పరివార్ ను ఏకం చేస్తారని అంటున్నారు. కేసీఆర్ ఆల్రెడీ బీహార్ టూర్ అందుకోసమే! కానీ టీడీపీ అలాంటివి ఖాతరు చేయకపోవచ్చు. ఎందుకంటే నాకు ఏపీ ముఖ్యం అని చంద్రబాబు మూడేళ్ల నుంచి మౌనంతో చెబుతున్నాడు. నేషనల్ మీద నో కామెంట్. పైపెచ్చు, చంద్రబాబు ఎగిరి దూకినప్పుడు, ఈ సోకాల్డ్ పార్టీలు కలిసి వచ్చిన దాఖలా లేదు కదా! నితీశ్ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? కేసీఆర్ ఎటు వైపు 2019లో? సో ఈ ఆర్గ్యుమెంట్ కి వేల్యూ వెరీ లిమిటెడ్.
ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా సీట్లు తగ్గుతాయా? పెరుగుతాయా? 2024లో సంగతి ఏంటనేది ఇప్పుడే అంచనా వేయడం కరెక్ట్ కాదు. కానీ ఏపీ ఈక్వేషన్ మాత్రం ఆల్మోస్ట్ క్లియర్ గానే ఉంది. దేశం సంగతి ఎలా ఉన్నా.. ఏపీ ముందే మైండ్ మేక్ చేసుకోవడం ముందు నుంచి ఉన్నదే! రాజీవ్ కి సింపథీ కలిసొచ్చినప్పుడు దేశం మొత్తం మ్మీద ఒక్క తెలుగు దేశం మాత్రమే ఎదురు నిలబడింది. అలాగే 2019లో ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీలో వరసగా రెండో ఛాన్స్ ఇస్తే ఏపీ మాత్రం నెత్తికి ‘నవరత్న’ పెట్టుకుంది. అంటే మన ప్రయారిటీస్ ఎప్పుడూ మనకి తెలుసు. అందుకని ఇక్కడ ఇండికేషన్ లో పెద్దగా ఛేంజ్ ఉండదు.
చంద్రబాబు బీజేపీని ప్రేమించాలని అనుకొని ఉండొచ్చు. అందుకే అడక్కపోయినా ముర్మూకు మద్దతు. అన్ని బిల్లులకి ఉడతా భక్తిగా సపోర్టు చేస్తున్నాడు. ఢిల్లీ వెళ్లినప్పుడు గౌరవపూర్వకమైన వినయంతో మాట్లాడాడు మోడీతో…ఇలా అన్నీ ఉన్నాయ్. మోడీ కూడా ప్రత్యేకంగా మాట్లాడిందీ ఇందుకే కావొచ్చు. కాకపోతే ఇంత ఘాటుగా, ఇంత త్వరగా బీజేపీ ఎదురు ప్రేమిస్తుందని ఊహించి ఉండకపోవచ్చు నిజంగా ! రిపబ్లిక్ టీవీ కథనంతో ఇండికేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఎందుకంటే ఆ ఛానెల్ ది రాజును మించిన రాజభక్తి. బీజేపీని మించిన రాజకీయం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjp tdp alliance again will chandrababu join nda
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com