Sanjan Kumar Yadav BJP controversy: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. ఇటీవల దేశ ప్రలకు కీలక సూచనలు చేశారు. ఇంధనం పొదుపు చేయాలని, బంగారం కొనొద్దని, డబ్బులు వృథా చేయొద్దని, వర్క్‌ఫ్రం హోం చేయాలని సూచించారు. అంతేకాదు మరుసటి రోజు నుంచే మోదీ ఇంధన పొందుపు ఆచరించడం మొదలు పెట్టారు. తన కాన్వాయ్‌ని సగానికి తగ్గించుకున్నారు. ఈ తరుణంలో బీజేపీ పాలక రాష్ట్రాల్లో కూడా మోదీ సూచనల అమలుకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామం చర్చనీయాంశమైంది.
అక్కడా బీజేపీ ప్రభుత్వమే..
మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. తాజాగా బింగ్ జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడిగా సంజన్‌కుమార్ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర శాఖ నియమించింది. దీంతో అత్యుత్సాహానికి పోయిన యాదవ్.. ఘటనంగా సంబురాలు చేశారు. ప్రభుత్వ నేతలు, పార్టీ ప్రతినిధులు ఇచ్చే సందేశాలు సామాజానికి మార్గదర్శకంగా నిలవాల్సినప్పటికీ, ఈ నియమాన్ని పట్టించుకోకుండా భారీ కాన్వాయ్‌తో రాలీ తీశారు. 150 కార్ల కాన్వాయ్‌తో ట్రాఫిక్ సమస్య సృష్టించాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. దీనికి సబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అవి రాష్ట్ర పార్టీ దృష్టికి వెళ్లాయి.
పార్టీ నుంచి సస్పెండ్..
సంజన్‌కుమార్ యాదవ్ చేసిన పనికి షాక్ అయిన పార్టీ రాష్ట్ర నేతలు వెంటనే ఆయనపై చర్య చేపట్టారు. పదవి నుంచి తొలగించడమే కాకుండా అతడిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ప్రధాని మోదీ స్వయంగా సంబురాలు చేసుకోవద్దని, ఇంధన పొదుపు పాటించాలని సూచించినా సంజన్‌కుమార్ యాదవ్ లెక్క చేయలేదు. దీంతో పదవి పోయింది.. పార్టీ సభ్యత్వం పోయింది.
దేశం కోసమే మోదీ కీలక సూచనలు చేశారు. కానీ ఆ పార్టీ నేతలే పాటించకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరెవరూ మోదీ సూచనలు ఉల్లంఘించకుండా మొదట్లోనే కట్టడి చేయడానికి బీజేపీ చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా పొదుపు పాటిస్తే మేలని విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.
