BJP Support Pawan Kalyan: ‘ఏపీ పరిణామాలపై మోడీ-షాలకు చెప్పడానికి నేనేం చిన్న పిల్లాడిని కాదు.. వారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా కూడా వైసీపీ అరాచకాలను ఒంటరిగా ఎదుర్కొంటాను.. కలబడుతాను.. నిలబడుతాను’ అని జనసేనాని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పోరాట పటిమకు అందరూ శభాష్ అంటూ కొనియాడారు. ప్రజల్లో పవన్ పోరాటానికి మంచి గుర్తింపు దక్కింది. అందుకే ఆయనకు బాసటగా నిలవడానికి కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ ముందుకొచ్చింది.
జనసేనకు దన్నుగా బీజేపీ నిలబడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. సోమువీర్రాజు రంగంలోకి దిగారు. వైసీపీ అరాచకాలకు బాధితుడిగా మారి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. పవన్ కళ్యాణ్ కు బీజేపీ తరుఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ సపోర్టుతో ఇక వైసీపీతో యద్ధమేనని అర్థమవుతోంది.
ఏపీలోని అధికార వైసీపీ ప్రతిపక్షాలను ఆడుకుంటోంది. చంద్రబాబును మీడియా సాక్షిగా హింసించి ఏడిపించాడు జగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కనీసం ప్రజలను కలుసుకోవడానికి విశాఖ కు వెళ్లిన పవన్ ను హోటల్ కే పరిమితం చేసి నిర్బంధించాడు. ఇంతటి దమనకాండను పవన్ కళ్యాణ్ సహించి భరించి తగ్గేదేలే అంటూ పోరాడారు.
పవన్ పోరాట పటిమకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇప్పటికే చంద్రబాబు ఫోన్ చేసి మరీ పవన్ కు అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బీజేపీ మద్దతునిచ్చింది. సోము వీర్రాజు స్వయంగా పవన్ ను కలిశారు. వైసీపీతో ఫైట్ లో బీజేపీలోకి దిగడం వైసీపీకి ముచ్చెమటలు పట్టడం ఖాయం.
ఎందుకంటే జగన్ పై అక్రమాస్తుల కేసు పెండింగ్ లో ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికీ సీఎం జగన్ పై దర్యాప్తు జరుపుతున్నాయి. కేంద్రం తలుచుకుంటే మళ్లీ జగన్ ను జైలుకు పంపండం పెద్ద విషయం కాదు. ఇన్నాళ్లు.. బీజేపీ, జనసేన వేర్వేరు దారులుగా రాజకీయం చేసి ఎవరికి వారు కార్యక్రమాలు చేయడంతో వైసీపీ దీన్ని అడ్వంటేజ్ గా మలుచుకొని ‘పవన్ కళ్యాణ్ ’ ఒంటరి అనుకొని వేధించడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు పవన్ కు తామున్నామంటూ బీజేపీ సపోర్టుగా నిలబడింది. దీంతో ఇప్పుడు పవన్ ను చూసి వైసీపీ వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి.
బీజేపీతో పెట్టుకోవడానికి జగన్ ఎప్పుడూ సిద్ధపడలేదు. కేంద్రం ఏ చట్టం తెచ్చినా.. బిల్లుల్లో అయినా సపోర్టు చేశాడు. ఏపీలో విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం హుకూం జారీ చేసినా అంగీకరించాడు. అలాంటి బీజేపీ సపోర్టు తో ఇప్పుడు పవన్ బలం కొండంత పెరుగుతుండగా.. వైసీపీ డిఫెన్స్ లో పడే ప్రమాదంలో చిక్కుకుంది. మరి ఈ రాజకీయం ఏపీలో వైసీపీకి నష్టం చేకూరుస్తుందా? పరిణామాలు ఎలా మారుతాయన్నది వేచిచూడాలి.