Homeజాతీయ వార్తలుTelangana BJP: తెలంగాణలో ‘కాషాయ’ దండు కదులుతోంది.. ప్రత్యర్థులకు హెచ్చరికే

Telangana BJP: తెలంగాణలో ‘కాషాయ’ దండు కదులుతోంది.. ప్రత్యర్థులకు హెచ్చరికే

Telangana BJP: భారతీయ జనతా పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీకి అండగా నిలిచే బూత్ కమిటీల ఎంపికపై ప్రాధాన్యం ఇస్తోంది. దీని కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమర్థవంతమైన వారిని నియమించి బూత్ కమిటీలను బలోపేతం చేసేందుకు నిర్ణయించింది. సంస్థాగతంగా పార్టీకి బలం చేకూర్చేందుకు ముందుకు కదులుతున్నారు. ఒక్కో బూత్ కమిటీకి 20 మందిని నియమించనున్నారు. బూత్ కమిటీల ప్రక్రియ బాధ్యతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు.

Telangana BJP
Bandi Sanjay

6.8 లక్షల మంది కాషాయ దళాన్ని తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 34 వేల బూత్ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. వేములవాడ నియోజకవర్గంలో లాంఛనంగా రెండు బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి వెన్నుముకగా బూత్ కమిటీలు నిలుస్తాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ కమిటీల నియామకంపై కసరత్తు మొదలైంది.

Also Read: CM Jagan- Rajya Sabha Candidates: జగన్ నిర్ణయాలతో బీసీలు కాదు.. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమం వచ్చేటట్లు ఉందే..

ఒక్కో బూత్ కమిటీలో 20 మందిని నియమించనున్నారు. దీంతో పార్టీని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాగత ఎన్నికలపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. బూత్ కమిటీల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే ప్రాంతం వారిని కమిటీలో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు.

Telangana BJP
Bandi Sanjay

బీజేపీని గడపగడపకు తీసుకెళ్లేందుకు విధి విధానాలను ఖరారు చేస్తోంది. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ద్వారా ప్రతి ఇంటికీ స్టిక్కరింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. స్టిక్కర్ లో ప్రధానమంత్రి, జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, జిల్లా, మండల శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల అధ్యక్షుల ఫొటోలు ముద్రించనున్నట్లు చెబుతున్నారు.

ఓటరు లిస్టులోని ప్రతి రెండు పేజీలకో పన్నా కమిటీని నియమించనుంది. ప్రతి మూడు బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఇన్ చార్జిని నియమింనున్నారు. బూత్ కమిటీల నిర్మాణం, పనితీరును పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే పనిలో భాగంగా కమిటీలను రెడీ చేస్తున్నారు. బూత్ కమిటీల నియామక ప్రక్రియ వేగవంతంగా నడిపించనున్నట్లు సమాచారం.

Also Read:Break To Gadapa Gadapa: ‘గడపగడప’కూ విమర్శలు… వదిలేస్తున్న మంత్రులు
Recommended Videos

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular