Homeఆంధ్రప్రదేశ్‌BJP Focused On AP: ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన మోదీ,...

BJP Focused On AP: ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన మోదీ, షా, నడ్డా త్రయం

BJP Focused On AP: భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై ద్రుష్టి పెట్టంది. ఇప్పటికే ఉత్తరాధి రాష్ట్రాలను కైవసం చేసుకున్న ఆ పార్టీ తన తరువాత ఫోకస్ ను దక్షిణాది రాష్ట్రాలపై పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైన పట్టు సాధించాలని తెగ ప్రయత్నం చేస్తొంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలన్న మోదీ, షా, నడ్డాల త్రయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నేతలకు దిశ నిర్దేశం చేశారు. బూత్ కమిటీలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణాలో బీజేపీ శక్తివంతంగా ఉంది. బాల్లియా ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఊపులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన నాయకులు ఉన్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. దీంతో ఏపీపైనే బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెంచింది. వచ్చే రెండేళ్లలో ఎలాగైనా పార్టీ ముద్ర చూపించాలని భావిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అకర్షవంతమైన నేతలను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. తటస్థులను ఆకర్షించడం ద్వారా గెలుపుబాట పట్టాలని నిర్ణయించింది. రెండేళ్లలో పార్టీ అగ్రనేతలు పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రధాని నుంచి కింది స్థాయి పదాదికారుల వరకూ అందర్ని మొహరించాలని నిర్ణయించడం వెనుక రాష్ట్రంలో బలోపేతం కావాలన్న కసి కేంద్ర నాయకత్వంలో పెరిగిందని చెప్పవచ్చు.

BJP Focused On AP
BJP Focused On AP

2024 ఎన్నికలే టార్గెట్
2024 ఎన్నికలే టార్గెట్ చేసుకొని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అగ్రనేతలను ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా రంగంలోకి దింపుతుంది. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీకి పట్టు కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు సాగిస్తుంది. వాస్తవానికి ప్రధాని మోదీ ఏపీలో పర్యటించింది తక్కువే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఒకటి రెండు సభలు, సమావేశాలకు హాజరయ్యారు. అటు తరువాత ఆయన రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు తక్కువే. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏపీలో పార్టీ బలోపేతం కాకపోవడంతో మోదీ, షా, నడ్డా త్రయం పునరాలోచనలో పడింది. తరచూ రాష్ట్రంలో పర్యటించడం ద్వారా పార్టీకి పునరుజ్జీవం తెప్పించి వచ్చే ఎన్నికల్లో గెలుపునకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు.

Also Read: Power Charges AP: లేదు లేదంటూనే బాదుడు.., జగన్ సర్కారు ఎడాపెడా బిల్లుల వాత.. మేలో రెట్టింపు చార్జీలు

ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ సారధ్యంలో పార్టీ బలోపేతం అయిందని భావిస్తున్న బిజెపి అధినాయకత్వం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా బిజెపి ఉంది అన్న భావనను ప్రజల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికలలో పొత్తులతో ముందుకు వెళితే పట్టు సాధించవచ్చు అన్న భావన బిజెపి అగ్రనేతలలో ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగానే మోడీ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఏంటి అన్నది ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. కానీ మోడీ ఏపీలో పర్యటించడం పక్కా అని తెలుస్తుంది. పూర్తిగా రాజకీయ కారణాలతోనే ప్రధాన నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నట్టు సమాచారం.

వైసీపీ బేజారు
ఏపీ బీజేపీలో విభేదాలున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాగానే పనిచేస్తున్నా నేతలు సహకరించడం లేదు. పార్టీలో జగన్, చంద్రబాబు అభిమానులు అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ బలోపేతానికి ఇది ప్రతిబంధకంగా మారింది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వ్యవహార శైలి కూడా వింతగా ఉంది. అప్పులతో పాటు రాజధాని మార్పు వంటి వాటి విషయంలో కేంద్ర పెద్దలకు చెప్పి చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు.

Somu Veerraju
Somu Veerraju

అందుకే బీజేపీ, వైసీపీ ఒక్కటే అన్న భావన ఏపీలో ఉంది. దీనిని తిప్పికొట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం కోపంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ పర్యటనకు వస్తున్న మోదీ జగన్ సర్కార్ పై విరుచుకుపడతారని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధించిన వ్యాట్ పై మాట్లాడిన మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఈ నేపథ్యంలో మోడీ పర్యటన పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈ నెల చివరి వారంలో ఏపీకి అమిత్ షా, జేపీ నడ్డా మోడీ టూర్ వచ్చేనెలలో ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల చివరి వారంలో ఏపీకి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటన ముగిసింది. అమిత్ షా పర్యటన కూడా కొనసాగనుంది. ఇదే క్రమంలో ఏపీలోనూ వీరిద్దరి పర్యటన తర్వాత వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Also Read:Ganta Srinivasa Rao: గంటా మళ్లీ యాక్టివ్.. మాజీ మంత్రి తీరుపై తెలుగు తమ్ముళ్ల గుస్సా

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

4 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular