Telangana: తెలంగాణలో బీజేపీ వ్యూహం మారుతోంది. విజయం కోసం అన్ని దారులు వెతుకుతోంది. అధికార పార్టీని ఎలాగైనా ఢీకొనాలనే తపనతో బీజేపీ ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పినట్లే తన బలం పెంచుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేస్తోంది. అధికార పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టే క్రమంలో బీజేపీ తన దూకుడును పెంచుతోంది. టీఆర్ఎస్ ను విమర్శిస్తూ తన బలం చూపించుకోవాలని తాపత్రయ పడుతోంది.

ఈ నేపథ్యంలో జాతీయ నాయకుల పర్యటనలతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెంచాలని చూస్తోంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును సావకాశంగా తీసుకుని జాతీయ నేతలు రాష్ర్టంలో పర్యటిస్తూ అధికార పార్టీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తోంది. కమలనాథుల తీరుతో టీఆర్ఎస్ పార్టీ అంతర్మథనంలో పడింది. బీజేపీ రాష్ర్టంలో ఎదుగుతున్నందున టీఆర్ఎస్ లో కూడా భయం పట్టుకుంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తోంది.
Also Read: తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా..?
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిరసన ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. రాష్ర్టంలో నియంత పాలన సాగుతోందని ఆక్షేపించారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలపై నిప్పులు చెరిగారు. దీంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, చత్తీస్ గడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ సైతం తెలంగాణలో పర్యటించడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోవడంతో బీజేపీ ముందుకొచ్చింది. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదు. కానీ బీజేపీని టార్గెట్ చేసుకుంటోంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం తెలుస్తోంది. అందుకే బీజేపీనే లక్ష్యం చేసుకుని టీఆర్ఎస్ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొందని చెబుతున్నారు. ఈక్రమంలోనే జాతీయ నేతల పర్యటనలు చేస్తూ టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలని భావిస్తోంది. అందుకే జాతీయ నేతలను రప్పిస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ బీజేపీ ప్రతిష్టను పెంచుకుంటోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?