Homeజాతీయ వార్తలుMLC Kavitha- RK: కేసీఆర్ కు చెక్ పెట్టేందుకే బీజేపీ లిక్కర్ పాలిటిక్స్? ఆర్కేతో...

MLC Kavitha- RK: కేసీఆర్ కు చెక్ పెట్టేందుకే బీజేపీ లిక్కర్ పాలిటిక్స్? ఆర్కేతో కవిత బిగ్ డిబేట్ కథేంటి?

MLC Kavitha- RK: దేశంలో ప్రాంతీయ పార్టీల బలహీనతనే బీజేపీ బలం. అవి అవినీతిలో కూరుకుపోవడమే బీజేపీకి ఆయుధం. తోకజాడించే ప్రాంతీయ పార్టీలు, నేతలపై ‘అవినీతి అస్త్రం’ ప్రయోగిస్తోంది బీజేపీ. దానికి ఎవరూ మినహాయంపు కావడం లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ వాదిగా బీజేపీని తూర్పారపడుతారు. తమిళనాడుకు వచ్చిన మోడీని వేదికపైనే నిలదీసిన పెద్దమనిషి.. కానీ కట్ చేస్తే దుబాయ్ లో ఆయన కంపెనీ హవాలా లావాదేవీలను ఈడీ బయటకు తీయడంతో పరుగు పరుగున ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల శరణు వేడారు.

MLC Kavitha- RK
MLC Kavitha- RK

ఇక జార్ఖండ్ లోనూ ఇదే కథ. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీపై తొడగొట్టిన సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కుర్చీకే బీజేపీ ఎసరు తెచ్చింది. బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో ఆయన ఎమ్మెల్యే పోస్టుపై అనర్హత వేటు వేసింది. ఇలా ప్రత్యర్థుల అవినీతియే బీజేపీ బలంగా మారుతోంది.

Also Read: Congress Crisis: కాంగ్రెస్ ‘చే’ జారుతున్న దిగ్గజ నేతలు.. ఇప్పటికీ 13 మంది ఔట్

తెలంగాణలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న కేసీఆర్ ను అదునుచూసి దెబ్బకొట్టింది బీజేపీ. మొన్నటికి మొన్న ‘ఈడీనా.. బోడీనా’ దమ్ముంటే రమ్మను.. అంటూ కేసీఆర్ సవాల్ చేశారు. ఇక మోడీని గోకుతానంటూ బీరాలు పలికాడు. కానీ మోడీ , అమిత్ షాలు స్పందించలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడ్డాక.. కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసీఆర్ కూతురు కవిత ఈ స్కాంలో ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. పాలకు పాలు.. మద్యానికి మద్యం అంటూ బీజేపీ నేతల మాటలకు కవిత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

MLC Kavitha- RK
RK

ఈ ఆరోపణలపై బీజేపీ పోరుబాట పట్టింది. కవిత ఇంటి ముందు ఆందోళనలు చేసింది. బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ అంతటా ఇప్పుడు కవిత లిక్కర్ స్కాం ప్రకంపనలే సాగుతున్నాయి. కేసీఆర్ కు చెక్ పెట్టేందుకే బీజేపీ లిక్కర్ పాలిటిక్స్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. అందుకే దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కవిత బయటకొస్తున్నారు. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్ నిర్వహిస్తున్నారు. బీజేపీ ఆరోపణలపై తన వివరణ ఇవ్వనున్నారు.

అసలే నిక్కచ్చిగా అడిగే ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణను ఫేస్ చేయడం అంటే కవిత అందుకు సమాయత్తం అయ్యి ఉండాలి. ఇక కవిత ఈ ఇంటర్వ్యూ వెనుక కేసీఆర్ కూడా ఉండొచ్చని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తమ స్వచ్ఛతను నిరూపించుకునేందుకే ఈ సాహసానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మరి కవిత ఏం మాట్లాడుతుంది? ఎలాంటి వివరణ ఇస్తుంది? బీజేపీ ఆరోపణలను ఎలా తిప్పికొడుతుందన్నది ఈరోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్ డిబేట్ లో చూడాల్సిందే..

Also Read:Lemongrass Products: కరువుతో అల్లాడే ‘వనపర్తి’ ఈ మొక్కతో ఎందుకు సంతోషంగా ఉంది?

 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ABN బిగ్ డిబేట్ || Big Debate Promo || ABN Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version