Etela Rajender- Teenmanr Mallanna: బీజేపీలో వర్గపోరు రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఒకరికి చెక్ పెట్టేందుకు మరొకరిని పార్టీలోకి తీసుకురావడం మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నదే. ఇప్పుడు ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయిపోయారు. ఈటల రాజేందర్ మీద ఉన్న హైప్‌ను, ఆయన దూకుడును తగ్గించేందుకు పార్టీలోకి తీన్మార్ మల్లన్నను బీజేపీ రాష్ట్ర అగ్ర నేతలు తీసుకువస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ఈటల రాజేందర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రజల్లో ఆయనను వీక్ చేయాలని బీజేపీ లీడర్లు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగనే బీజేపీలోకి చేరికలూ కొనసాగుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేకులు, ఉద్యమకారులు, పాపులర్ లీడర్స్ అందరికీ బీజేపీ వేదిక అయ్యేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టు, క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 7న మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

తీన్మార్ మల్లన్నను బీజేపీలో చేర్చుకోవడం వెనుక మరో నయా ప్లాన్ బీజేపీ వేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే సీన్ క్రియేట్ కాగా, చివరకు ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ విషయం పట్ల తనదైన శైలిలో స్పందించే ఈటల రాజేందర్ తర్వాత కాలంలో బీజేపీ తరఫున ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ప్రచారం కూడా సాగింది. ఈ విషయం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో బీజేపీ పోటికి దూరంగా ఉంటుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కానీ, ఈటల రాజేందర్ మాత్రం టీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ సర్దార్ రవీందర్ సింగ్‌కు మద్దతు పలికారు. దాంతో ఈటల దూకుడుకు చెక్ పెట్టాలని బీజేపీ నేతలు తీన్మార్ మల్లన్నను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: రిసార్టుల్లో లోకల్ జోష్.. చిందేస్తున్న తెలంగాణ లీడర్లు
తీన్మార్ మల్లన్న లాంటి పాపులర్ లీడర్ బీజేపీలో చేరడం ద్వారా ఈటల దూకుడుకు ఇట్టే చెక్ పెట్టేయొచ్చని కమలనాథులు ప్లాన్ చేసినట్లు వినికిడి. ఈటల రాజేందర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు తాను సై అనే సంకేతాలు కూడా తీన్మార్ మల్లన్న ఇచ్చారని టాక్. తీన్మార్ మల్లన్న కూడా ఈటల రాజేందర్ మాదిరిగా లెఫ్ట్ రాజకీయాల్లో పుట్టి పెరిగి, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా పని చేశారు. ఈ క్రమంలోనే రైట్ వింగ్ పార్టీ అయిన బీజేపీలో కూడా తనదైన పాత్ర పోషించేందుకుగాను మల్లన్న ఆ పార్టీలో చేరబోతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యులు, ఉద్యమ కారుడు, ఉద్యోగ సంఘం నేతగా పని చేసిన చింతలగట్టు విఠల్, జర్నలిస్టు రాణీ రుద్రమ కూడా బీజేపీలో చేరబోతున్నారు. మొత్తంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు.
Also Read: కేసీఆర్ లో ఆందోళన అందుకేనా? ఏమైందిలా?