కన్నపై ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేతల మౌనం

బిజెపి రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కడుగా రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వ అక్రమాలను, కరోనా వైరస్ కట్టడిలో వైఫల్యాలను ఎండగడుతూ ఉంటె సహించలేక వైసిపి నేతలు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలు మౌనంగా ఉండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. చంద్రబాబునాయుడు వద్ద రూ 20 కోట్లు తీసుకొని వైసిపి ప్రభుత్వంపై కన్నా విమర్శలు చేస్తున్నారని, బిజెపి విధానానికి భిన్నంగా సొంత ప్రయోజనాలకోసం చేస్తున్నారని విజయసాయిరెడ్డి వంటి వారు పదే […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 3:58 pm
Follow us on


బిజెపి రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కడుగా రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వ అక్రమాలను, కరోనా వైరస్ కట్టడిలో వైఫల్యాలను ఎండగడుతూ ఉంటె సహించలేక వైసిపి నేతలు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలు మౌనంగా ఉండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

చంద్రబాబునాయుడు వద్ద రూ 20 కోట్లు తీసుకొని వైసిపి ప్రభుత్వంపై కన్నా విమర్శలు చేస్తున్నారని, బిజెపి విధానానికి భిన్నంగా సొంత ప్రయోజనాలకోసం చేస్తున్నారని విజయసాయిరెడ్డి వంటి వారు పదే పదే ఆరోపణలు చేస్తుంటే బీజేపీ ప్రముఖులు ఎవ్వరు మాట్లాడక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వారంతా విజయసాయిరెడ్డి ప్రలోభాలకు లొంగి, కన్నాను ఒంటరి వారు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చివరకు ఆయన కార్యవర్గంలో కీలకమైన ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నలుగురు సహితం మౌనం వహిస్తున్నారు.

కన్నాకు బిజెపితో సంబంధం లేదన్నట్లు వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తుండటం గమనార్హం. పార్టీ ఎమ్యెల్సీ సోము వీర్రాజు ఒక ప్రకటన చేస్తినా “మీరా విధంగా ఆరోపణలు చేయడం బాగోలేదు” అంటూ విజయసాయిరెడ్డిని బ్రతిమిలాడుతున్నట్లు వ్యవహరించారు గాని “మా పార్టీ అధ్యక్షుడిని అంతమాట అంటారా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

మరో ఎమ్యెల్సీ పివి మాధవ్ ఈ రోజులలో ఏమయ్యారో తెలియడం లేదు. ఇక కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న డి పురందేశ్వరి తన పేరును కూడా కలపడంతో కేవలం “మా పార్టీ అంతర్గత వ్యవహారాలు మీకెందుకు” అన్నట్లు మాటవరసకు అన్నారు. రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సునీల్ దేవధర్ సహితం వైసిపి నేతలకు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లు మొక్కుబడి ప్రకటన చేశారు.

ఇక జగన్ ప్రభుత్వాన్ని ఏమైనా అంటే అంతెత్తున లేచే పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఎక్కడున్నారో అసలు కనిపించడం లేదు. కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఏకైక నేత జి కిషన్ రెడ్డి సహితం తమ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత ఆరోపణలు చేస్తుంటే నోరు విప్పడం లేదు. ఆయనకు సహితం వైసిపి నేతలను ఇరకాటంలో పెట్టడం ఇష్టంగా ఉన్నట్లు లేదు.

నిత్యం వార్తలలో కనిపించే యువమోర్చ, మహిళామోర్చా, ఎస్సి మోర్చా అద్యక్షులు సహితం మౌనవ్రతం పాటిస్తున్నారు. వీరంతా కన్నాకు మద్దతు ఇస్తే వైసిపి నేతలకు ఎక్కడ ఆగ్రహం కలిగించినట్లు అవుతుందో అని వెనుకడుగు వేస్తున్నారా?