Amaravathi: అమరావతి సాకారం వెనుక ‘బీజేపీ-జనసేన’

Amaravathi: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనమైంది. అమరావతి రైతుల రాజధాని పోరాటం ఫలించింది. ప్రతిపక్ష బీజేపీ-జనసేన ఆందోళనకు ఫలితం దక్కింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేసిన బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు పోరాడుతూనే ఉన్నారు. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక […]

Written By: NARESH, Updated On : March 5, 2022 5:33 pm
Follow us on

Amaravathi: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనమైంది. అమరావతి రైతుల రాజధాని పోరాటం ఫలించింది. ప్రతిపక్ష బీజేపీ-జనసేన ఆందోళనకు ఫలితం దక్కింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేసిన బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు.

Amaravathi

ఒకటి కాదు.. రెండు కాదు.. జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు పోరాడుతూనే ఉన్నారు. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని పక్కనపెట్టి మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. విశాఖను పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. దీంతో చిచ్చు మొదలైంది. అప్పటి నుంచి అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళన చేశారు. అయినా జగన్ సర్కార్ కరగకపోవడంతో ఇక చేసేదేం లేక హైకోర్టును ఆశ్రయించారు.

ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు విజయం సాధించినట్టు అయ్యింది. హైకోర్టు తీర్పును అంద‌రు స్వాగ‌తిస్తున్నారు. ఏకంగా రాజధాని రైతులు హైకోర్టు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ధ‌ర్మం గెలిచింద‌ని సంబరాలు చేసుకున్నారు. 807 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్య‌మానికి శ‌క్తి వ‌చ్చిన‌ట్ల‌యింది.

హైకోర్టు తీర్పుతో అన్ని వ‌ర్గాల్లో ఆనందం వెల్లివెరిసింది. హైకోర్టు తీర్పుతోనైనా ప్ర‌భుత్వంలో మార్పు రావాల‌ని ఆశిస్తున్నారు. అన్ని రాజ‌కీయ పార్టీలు ఏక‌మైనా వైసీపీ మాత్రం తాను అనుకున్న‌ది చేయాల‌ని సంక‌ల్పించ‌డమే ఈ వివాదానికి కారణమైంది.

Pavan Kalyan, Narendra Modi, Somu Veerraju

జ‌న‌సేన‌, బీజేపీలు మ‌ద్ద‌తు తెలిపినా ప్ర‌భుత్వం మాత్రం స‌సేమిరా అంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, జనసేన నేతలు రోడ్డెక్కి అమరావతి కోసం ఆందోళన చేశారు. రాజధాని రైతుల పాదయాత్రలో సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ పాల్గొని మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ స్వయంగా సభల్లో పాల్గొని అమరావతి రైతుల పోరాటంలో పాలుపంచుకున్నారు. దీంతో వైసీపీ ఒంట‌రైపోయింది.

అమ‌రావ‌తికి భూములిచ్చిన రైతులు రాజ‌ధాని విష‌యంలో త‌గ్గేదే లేద‌ని ఎదురు తిరిగినా ప్ర‌భుత్వం చివరకు న్యాయపోరాటంలో ఓడిపోయినట్టైంది. ఫ‌లితంగా ఉద్య‌మానికి మద్దతుగా పలువురు ఆర్టిస్టులు గళం ఎత్తారు. మహిళలు ఆందోళన చేశారు. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ అవ‌హేళ‌న చేసినా వారు ప‌ట్టించుకోలేదు. త‌మ ప్రాంతం కోసం ఉద్య‌మంలో పాల్గొని తామేంటో నిరూపించారు.

ఇప్పటికే ఏపీకి రాజధాని లేకపోవడంతో ఎంతో నష్టం వాటిల్లుతోంది.రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబ‌డులు రాకుండా పోతున్నాయి.. మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో పెట్టుబ‌డులు ప‌క్క రాష్ట్రానికి త‌ర‌లిపోతున్నాయి. ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టినా జ‌గ‌న్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాన‌నుకున్న‌ది చేస్తాన‌ని ముంద‌డుగు వేస్తోంది.

నిరంకుశంగా ప‌రిపాల‌న చేస్తూ ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌నే డిమాండ్ వ‌స్తోంది. ఈ మేరకు బీజేపీ, జనసేన నేతలు డిమాండ్లు చేస్తున్నారు. దీనిపై ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో ఇంకా తెలియ‌డం లేదు.

Also Read: ఆర్టికల్ 370 డి రద్దుతో మోడీ సాధించేంటి? కశ్మీర్ లో వచ్చిన మార్పేంటి?

హైకోర్టు తీర్పు తర్వాత అయినా.. ప్ర‌భుత్వం ప్ర‌జామోద కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని రాజధాని రైతులు హితవు పలుకుతున్నారు. ప్ర‌జాగ్ర‌హం వ్య‌క్తం చేసే ప‌నుల ప‌ట్ల ప‌ట్టింపుల‌కు పోకుండా ఉండాల‌ని సూచిస్తున్నారు. అయినా జ‌గ‌న్ మాత్రం త‌న పంతం మార్చుకునేలా లేన‌ట్లు క‌నిపిస్తోంది. ఇంత జ‌రుగుతున్నా సీఎం జగన్ అమరావతిపై నెక్ట్స్ ఏం చేయాలన్న దానిపై రివ్యూ చేశారు. హైకోర్టుకు వెళ్లడమో.. సవాల్ చేయడమో చేస్తామని డిసైడ్ అయ్యారు. దీంతో హైకోర్టు తీర్పును స్వాగతించే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం లేదని.. దీన్ని సవాల్ చేయాలని డిసైడ్ అయ్యింది.

అయితే రాజధాని రైతుల వెంట బీజేపీ, జనసేన బలంగా నిలబడుతున్నాయి. ఇప్పటికే తీర్పును స్వాగతించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జగన్ సర్కార్ తీరు మార్చుకోవాలని.. రాజధాని రైతుల వెంట నిలబడుతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని తీరం దాటించిన ఘనత ఖచ్చితంగా బీజేపీ-జనసేన నేతలకే దక్కుతుందని రాజధాని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?

Recommended Video: