
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికార పక్షమైన వైసీపీ మీద ఇష్టం వచ్చినట్లుగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం, పాలకుల అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీలో పోరాడకుండా గల్లీలో ఆడుతున్న డ్రామాలను నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లకపోయినా.. తన వాదనను రోజూ వీడియోల ద్వారా విడుదల చేస్తున్నారు. దాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారు. పవన్ కల్యాణ్ మాత్రమే విమర్శిస్తున్నారు. అదే సమయంలో జనసేనకు మిత్రపక్షంగా ఉన్న పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోయింది.
Also Read: ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు మళ్లీ ఝలక్
బీజేపీ నేతలకు తమకు అలవాటైన రాజకీయాన్నే చురుగ్గా నడిపిస్తుంటారు. అధికార పార్టీ పేరుతో ప్రతిపక్షాన్ని విమర్శింస్తుంటారు. వైసీపీ విధానాలను ప్రశ్నించాలి కానీ.. పైపైన సుతిమెత్తగా విమర్శలు చేసేసి.. టీడీపీపైకి వచ్చేస్తారు బీజేపీ నేతలు. ఆయన స్ట్రాటజీనే ఇతర నేతలు ఫాలో అవుతారు. ఎవరైనా బీజేపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టారంటే.. ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ.. ముందుగా ప్రతిపక్ష చంద్రబాబును, ఆయన పాలనను విమర్శిస్తుంటారు.ఆ తర్వాత వైసీపీ వైపు తమ మాటలను మళ్లిస్తుంటారు. దాంతో.. వారి తీరు వల్ల బీజేపీ.. వైసీపీకి మిత్రపక్షం అనే ముద్రపడిపోతోంది.
మరోవైపు జనసేన మాత్రం.. ఇలాంటి విషయాల్లో బీజేపీ నేత తనపై పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. బీజేపీలో వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వారితో కలిసి స్టేజ్‌లు పంచుకోవడం వంటివి చేయడం లేదు. జనసేన స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా.. సందర్భం వస్తే తప్ప.. బీజేపీతో తమ పొత్తు గురించి ప్రస్తావించడం లేదు. కలిసి పోటీ చేస్తున్నామన్న విషయాన్ని చాలా లో ప్రొఫైల్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొక్కుబడిగా బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. అంతే కాదు.. బీజేపీ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరణ కూడా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: యుద్ధం నుంచి.. ఉద్భవించిన మహిళా దినోత్సవం..!
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై పవన్ కల్యాణ్ మొదటి నుంచి అసహనంతో ఉన్నారని జనసేన వర్గాలు కొన్నాళ్లుగా చెబుతున్నాయి. తిరుపతి ఉపఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్‌ను కించ పరిచేలా ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేశారు. అదే సమయంలో పొత్తు ధర్మం పాటించకుండా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీపై పోరాడాల్సిన పరిస్థితిలో మిత్రపక్షం అన్నట్లుగా ప్రజల్లో ముద్రపడేలా వ్యవహరిస్తున్నారు. వీరందరి తీరుపై బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే.. ఇది అంతర్గత విషయం. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న రాజకీయం విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ అంత సంతృప్తిగా లేరనే మాట మాత్రం నిజమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్